
హైదరాబాద్: తెలంగాణలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన రోహత్ కుమార్ రెడ్డి విజయవాడ నుండి హైద్రాబాద్‌కు పాదయాత్రగా చేరుకొన్నారు.
17 రోజులపాటు పాదయాత్ర చేసి హైద్రాబాద్‌కు వచ్చిన రోహిత్‌కుమార్ రెడ్డిని ఆదివారం నాడు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రోహిత్ కుమార్ రెడ్డిని మంత్రి కేటీఆర్ సన్మానించారు. యువతకు స్పూర్తిగా కేటీఆర్ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని రోహిత్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.
అందుకే తాను తన గుండెలపై కేటీఆర్ బొమ్మను టాటూగా వేయించుకొన్నట్టు రోహిత్ చెప్పారు. డిసెంబర్ 7వ తేదీన జరిగే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధించాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రోహిత్‌కుమార్ రెడ్డిని సన్మానించిన ఆయనతో మాట్లాడుతున్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.