బిల్డింగ్ మీదినుంచి దూకి తొమ్మిదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి..

By SumaBala Bukka  |  First Published Jul 20, 2022, 12:50 PM IST

ఓ తొమ్మిదేళ్ల బాలిక బిల్డింగ్ మీదినుంచి దూకి చనిపోయింది. అయితే తన ఇంటినుంచి కొద్దిదూరంలో ఉన్న బిల్డింగ్ దగ్గరికి ఆటోలో రావడం.. ఎవరితోనో ఫోన్లో మాట్లాడడం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. 


హైదరాబాద్ : ఎల్బీనగర్ లో ఓ తొమ్మిదేళ్ల బాలిక మృతి కేసు మిస్టరీగా మారింది. ఈ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బిల్డింగ్ మీదినుంచి కిందపడి తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురానగర్ లో నివాసం ఉంటున్న సత్యనారాయణ రెడ్డి రెండో కూతురు వర్షిత (9) కిరాణా షాపుకు వెళ్లి వస్తానని తల్లికి చెప్పి బైటికి వచ్చింది.

అలా వచ్చిన చిన్నారి ఓ ఆటోను పిలిచి అందులో చంద్రపురి కాలనీలోకి ఓ బిల్డింగ్ దగ్గరికి వెళ్లింది. ఆటోలో వెడుతున్న సమయంలోనే ఆటో డ్రైవర్ ఫోన్ తీసుకుని గుర్తు తెలియని వ్యక్తికి ఫోన్ చేసింది. ఆ తరువాత ఐదు నిమిషాలకు బిల్డింగ్ దగ్గర ఆటో దిగింది. బిల్డింగ్ మీదికి వెళ్లి అక్కడి నుంచ కిందికి దూకేసింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

Latest Videos

undefined

శంషాబాద్ ఓఆర్ఆర్ పై కారు ప్రమాదం.. టీఆర్ఎస్ నాయకుడి కుమారుడు మృతి..

కాగా, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆ చిన్నారి మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగారు. కుటుంబంలో విషాదం నెలకొంది. కిరాణా షాపుకు వెడతానన్న చిన్నారి.. అంత దూరం బిల్డింగ్ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఎవరితో మాట్లాడింది.? ఎవరికి కాల్ చేసింది? ఎలా పడిపోయింది? ఆమె దూకిందా? ఎవరైనా తోసేశారా? అసలు ఏం జరిగింది అనేదానిమీద పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వర్షితది హత్యా? లేక ప్రమాదమా? కావాలనే పడిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. భవనంలో ఉన్నవారిని పోలీసులు విచారిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని సైతం పరిశీలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా, కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి కుమార్తె మీద పలుసార్లు అత్యాచారం జరిపాడు. ఈ నేరం రుజువు కావడంతో తండ్రికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.100 జరిమానా విధించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జరిగింది. ఈమేరకు పోక్సో చట్టం కేసుల ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కె. రామశ్రీనివాసరావు తీర్పునిచ్చారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం, కిటుముల పంచాయితీ, బౌడ గ్రామానికి చెందిన  బాలిక (14) సమీపంలోని ఓ స్కూల్లో 8 వ తరగతి చదువుతుంది. అక్కడి హాస్టల్ లోనే ఉండేది. ఆమె తండ్రి కూలీ పనులు చేసేవాడు. స్కూల్లో చదువుతున్న కుమార్తెను ప్రతివారం ఇంటికి తీసుకువచ్చి బెదిరించి అత్యాచారం చేసేవాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.. దీంతో బాలిక భయపడి మౌనంగా ఉండిపోయింది. ఈ క్రమంలో 2019 సెప్టెంబర్ 3న హాస్టల్ నుంచి కుమార్తెను ఇంటికి తీసుకువచ్చాడు.కుటుంబ సభ్యులు అందరూ  బయటకు వెళ్లడంతో కూతురి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే బయటికి వెళ్ళిన భార్య  ఏదో పని మీద  వెంటనే వెనక్కి రావడంతో  జరుగుతున్నఘోరాన్ని చూసింది. వెంటనే కుమార్తెను తీసుకుని చింతపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.

click me!