శంషాబాద్ ఓఆర్ఆర్ పై కారు ప్రమాదం.. టీఆర్ఎస్ నాయకుడి కుమారుడు మృతి..

Published : Jul 20, 2022, 10:58 AM IST
శంషాబాద్ ఓఆర్ఆర్ పై కారు ప్రమాదం.. టీఆర్ఎస్ నాయకుడి కుమారుడు మృతి..

సారాంశం

ఓఆర్ఆర్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ టీఆర్ఎస్ నేత కుమారుడు దుర్మరణం పాలయ్యాడు. 

రంగారెడ్డి జిల్లా :  శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న డీసీఎం వ్యానును హ్యుందాయ్ వెర్నా కారు బలంగా ఢీకొట్టింది. కారు బోల్తా పడటంతో అందులోని యువకుడు మృత్యువాతపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.

చనిపోయిన వ్యక్తిని నల్గొండ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపిపి రేగట్టె మల్లికార్జున రెడ్డి కుమారుడు దినేష్ రెడ్డిగా గుర్తించారు. దినేష్ రెడ్డి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. తమ కొడుకు కళ్లను కుటుంబ సభ్యులు దానం చేశారు. నల్గొండలోని వీటీ కాలనీలోని స్వగృహానికి ప్రత్యేక అంబులెన్స్లో మృతదేహాన్ని తరలించారు. టిఆర్ఎస్ నాయకులు రేగట్టె మల్లికార్జున రెడ్డి కుటుంబాన్ని మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి పరామర్శించారు. 

ఆగ‌ని లోన్ యాప్ ఆగ‌డాలు.. భార్య నెంబ‌ర్ అశ్లీల సైట్ల‌లో పెట్టాల‌ని కానిస్టేబుల్ కు వేధింపులు.. మ‌న‌స్థాపంతో..

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?