ఇకపై కరోనా కేసులు తగ్గుముఖం...కారణమిదే: మంత్రి ఈటల

By Arun Kumar P  |  First Published Apr 21, 2021, 2:30 PM IST

వైద్యారోగ్య శాఖకు తోడుగా ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి రాష్ట్రంలో అనుక్షణం కరోనా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 


హుజురాబాద్: తెలంగాణలో కరోనా కేసుల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు పని చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. వైద్యారోగ్య శాఖకు తోడుగా ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి అనుక్షణం పరిస్థితి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. 

''హైదరాబాద్ కు మన రాష్ట్రం నుండి కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పేషంట్లు వస్తారు. కాబట్టి రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ను కోరాం. ఇప్పటివరకయితే ఆక్సిజన్ కొరత లేకుండా చూశాం. పేషంట్లు పెరిగితే ఆక్సిజన్ కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఆసుపత్రి యాజమాన్యాలు, డాక్టర్లు పేషంట్ కు అవసరాన్ని బట్టి ఆక్సిజన్ ఇవ్వాలి... పేషంట్ ల డిమాండ్ ను బట్టి ఆక్సిజన్ ఇవ్వరాదు'' అని ఈటల సూచించారు. 

Latest Videos

undefined

read more  నిజామాబాద్ లో కరోనా కల్లోలం... గంట వ్యవధిలోనే దంపతుల మృతి

''కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వచ్చే నెల మొదటి నుండి 18 సంవత్సరాలు నిండిన వారికి కూడా వ్యాక్సిన్ ఇస్తాం. గత వారం రోజుల నుండి తెలంగాణ లో కేసులు పెద్దగా పెరగడం లేదు.రాత్రి కర్ఫ్యూ ద్వారా ఇంకా కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం వుంది'' అని పేర్కొన్నారు. 

''కరోనా కేసులు ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కేసులు పెరగకుండా స్థానిక ప్రజా ప్రతినిధలు బాధ్యత వహించాలి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో వరికోతలు జరుగుతున్నాయి కాబట్టి రైతులు, కూలీలు జాగ్రత్తగా వుండాలి.  ప్రస్తుత తరుణం లో మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించాలి'' అని మంత్రి ఈటల సూచించారు. 
 

click me!