హెచ్‌యూటీతో సంబంధాలు: హైద్రాబాద్‌లో సల్మాన్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

Published : Aug 01, 2023, 04:48 PM ISTUpdated : Aug 01, 2023, 05:07 PM IST
హెచ్‌యూటీతో  సంబంధాలు: హైద్రాబాద్‌లో సల్మాన్‌ను అరెస్ట్ చేసిన ఎన్ఐఏ

సారాంశం

హైద్రాబాద్ లో  హెచ్‌యూటీ తో  సంబంధాలున్న సల్మాన్ ను  ఎన్ఐఏ అధికారులు అరెస్ట్  చేశారు.

హైదరాబాద్: నగరంలో హెచ్‌యూటీతో సంబంధాలున్న సల్మాన్  ను  ఎన్ఐఏ అధికారులు  అరెస్ట్  చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్, హైద్రాబాద్ లలో హెచ్‌యూటీ సభ్యులు  పేలుళ్లకు  కుట్ర పన్నారు. ఇప్పటికే  ఎన్ఐఏ  హైద్రాబాద్, భోపాల్ లో  17 మందిని  అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది మే 9వతేదీన  హైద్రాబాద్ లో  మధ్యప్రదేశ్ ఏటీఎస్, తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు  సోదాలు చేశారు.  హైద్రాబాద్, భోపాల్ లలో  16 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో  11 మంది  భోపాల్ కు చెందినవారు. మిగిలిన ఐదుగురిని  హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. మే  15వ తేదీన  మరో ఇద్దరిని, మే 18న  మరో ముగ్గురిని హైద్రాబాద్ లో అరెస్ట్  చేశారు ఏటీఎస్ అధికారులు.  ఇవాళ  హైద్రాబాద్ లో సల్మాన్ అనే వ్యక్తిని  పోలీసులు అరెస్ట్  చేశారు.

భోపాల్ కు ఏటీఎస్ పోలీసులు   హైద్రాబాద్ లో ఉంటున్నవారిపై నిఘా  ఏర్పాటు  చేశారు.మధ్య ప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు  తెలంగాణకు  చెందిన  కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు రాష్ట్రాలకు  చెందిన పోలీసులు  సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు.

మధ్యప్రదేశ్  రాష్ట్రంలోని మోతీలాల్ స్టేడియం సహా  పలు ప్రాంతాల్లో  హెచ్‌యూటీ  పేలుళ్లకు  ప్లాన్  చేశారని  దర్యాప్తు సంస్థలు  గుర్తించాయి.  విదేశాల నుండి  వస్తున్న వాయిస్ మేసేజ్ ల ఆధారంగా  నిందితుల ప్లాన్ ను  గుర్తించాయి దర్యాప్తు సంస్థలు.

 హైద్రాబా

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?