ఏపీ, తెలంగాణలలో దాడులకు స్కెచ్... ఎన్ఐఏ అదుపులో నలుగురు పీఎఫ్ఐ కార్యకర్తలు

By Siva KodatiFirst Published Sep 20, 2022, 4:58 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో దాడులకు కుట్ర పన్నిన నలుగురు పీఎఫ్ఐ కార్యకర్తలను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. వీరంతా శిక్షణ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, మత ఘర్షణలకు తావిచ్చేలా పీఎఫ్ఐ ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపింది. 
 

తెలంగాణలో నలుగురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్ట్ చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ). నిజామాబాద్, ఆదిలాబాద్, శామీర్‌పేట, కరీంనగర్‌లలో వీరిని అదుపులోకి తీసుకుంది. వీరిని సమీర్, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ ఉస్మాన్, ఇర్ఫాన్‌లుగా గుర్తించారు. నలుగురిని కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఎన్ఐఏ. దీనిలో పలు కీలక అంశాలను ప్రస్తావించింది ఎన్ఏఐ. వీరంతా శిక్షణ ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. రెచ్చగొట్టే ప్రసంగాలు, మత ఘర్షణలకు తావిచ్చేలా పీఎఫ్ఐ ట్రైనింగ్ ఇస్తున్నట్లు తెలిపింది. ఉగ్రవాద శిక్షణ కోసం ఇతర ప్రాంతాల నుంచి పీఎఫ్ఐ నిధులు సేకరిస్తున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది. వీరు తెలంగాణ, ఏపీలలో పలు చోట్ల దాడులకు కుట్ర పన్నినట్లు తెలిపింది. 
 

click me!