
ఆమె ఓ ప్రైవేటు హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ (lab technician) గా పని చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులు ఆమెను మేన బావకు ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. మేనరికం ఇష్టం లేదని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అయినా తల్లిదండ్రులు వినకుండా తమ బాధ్యత తీరుపోతుందనే ఉద్దేశంతో కూతురుకు నచ్చజెప్పారు. ఎట్టకేలకు పెళ్లికి ఒప్పించారు. వారం రోజుల కిందట అనుకున్నట్టుగానే మేనబావతో పెళ్లి జరిపారు. అనంతరం ఇంటికి వచ్చారు. పెళ్లి విషయంలో మనస్థాపం చెందిన ఆమె ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ (hyderabad) పట్టణంలోని ఈసీ నగర్ (ec nagar) శైలజ (22) ఓ ప్రైవేటు హాస్పిటల్ (Privet hospital) లో ల్యాబ్ టెక్నీషయన్ (lab technician) గా పని చేస్తున్నారు. ఆమె తండ్రి పేరు యాకాంతం. ఆయన ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. కూతురుకు తండ్రి పెళ్లి చేయాలనుకున్నారు. మేనళ్లుడికి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటదని భావించారు. మేనళ్లుడిది వరంగల్ (warangal) జిల్లా చెన్నారావు పేట (chennarao peat) మండలంలోని లింగగిరి (lingagiri) గ్రామం. పెళ్లి విషయం కూతురుకు చెప్పారు. అయితే తనకు మేనరికం ఇష్టం లేదని శైలజ తల్లిదండ్రులకు చెప్పారు. కానీ తల్లిదండ్రులు ఆమెను పెళ్లికి ఒప్పించారు.
మేనళ్లుడి సొంత గ్రామంలో ఫిబ్రవరి (february) 17వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి వేడుకలు పూర్తయిన తరువాత ఆయన హైదరాబాద్ కు ఈ నెల 22వ తేదీన వచ్చేశారు. బుధవారం తండ్రి ఆఫీసుకు వెళ్లారు. తల్లి ఇంట్లోనే ఉన్నారు. అయితే ఆమె బెడ్ రూమ్ (bed room)లో ఉండటంతో బయట నుంచి కూతురు గడియపెట్టారు. ఇంట్లో హాల్ లో ఉన్న ఫ్యానుకు ఉరేసుకున్నారు. చుట్టుపక్కల వారు వచ్చి తలుపు తీసేసరికే ఆమె ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. వెంటనే ఆమెను హాస్పిటల్ (hospital) కు తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.