కాళ్లపారాణి ఆరకముందే కాటికి.. పెళ్లైన రెండోరోజే ఉరేసుకున్న నవ వధువు...

Published : May 29, 2021, 11:27 AM IST
కాళ్లపారాణి ఆరకముందే కాటికి.. పెళ్లైన రెండోరోజే ఉరేసుకున్న నవ వధువు...

సారాంశం

భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి పందిరికి కట్టిన తోరణాలు వాడనే లేదు... కాళ్లకు పెట్టిన పారాణి ఆరలేదు... ఏమైందో ఏమో తెలియదు కానీ.. నవ వధువు బలవన్మరణానికి పాల్పడిన ఘటన భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం మర్రిబావితండాలో శుక్రవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మర్రిబావితండాలో చెందిన పుల్య-సాలి దంపతుల రెండో కూతురు అనూష (21) కి నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దవూర తండాకు చెందిన వ్యక్తితో ఈ నెల 26న వధువు  ఇంటి వద్ద వివాహం జరిగింది. 

27న వరుడి ఇంట్లో వివాహ విందు జరిగింది. అదే రోజు అర్ధరాత్రి కొత్తజంట మర్రిబావితండాకు వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం కొత్త పెళ్లి కూతురు ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లింది. పెళ్లి అలసటతో నిద్రిస్తుందేమోనని అందరూ భావించారు.

ఈటెల ఎఫెక్ట్: గులాబీ గూటికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గుడ్ బై...

అయితే సాయంత్రం ఎంత పిలిచినా తలుపులు తెరవకపోవడంతో వాటిని ధ్వంసం చేసి చూసేసరికి చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి కనిపించింది. వివాహం జరిగి రెండు రోజులు గడవక ముందే పెళ్లికూతురు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సుధాకర్ రావు కేసు నమోదు చేసుకున్నారు. మృతికి కారణాలు ఆరా తీస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్