బావ వరుసవుతానంటూ ప్రేమ పాఠాలు, పెళ్లి... చివరికి అన్నవరుస అనే నిజం తెలియడంతో...

Published : Sep 21, 2021, 11:29 AM IST
బావ వరుసవుతానంటూ ప్రేమ పాఠాలు, పెళ్లి... చివరికి అన్నవరుస అనే నిజం తెలియడంతో...

సారాంశం

ఇంటి పేరు మార్చి చెప్పి.. వరుసకు బావ అవుతానని చెప్పి మోసం చేశాడు. అతన్ని నమ్మిన ఆ యువతి అమాయకంగా ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకుంది. చివరికి కొద్ది రోజుల తరువాత ఆ యువతికి  అతను అన్న వరస అవుతాడని తెలిసింది. 

భద్రాద్రి కొత్తగూడెం : ఇల్లందులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే దారణమైన నిజాన్ని భరించలేక ఓ నవవధువు ఆత్మహత్యాయత్నం (Suicide Attempt) చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెడితే.. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, ఇల్లందులో ఓ యువకుడు వెంకటేష్ ఓ యువతిని చూశాడు. ఆమె నచ్చింది. ఎలాగైనా ప్రేమించాలనుకున్నాడు. కానీ అది సాధ్యం అయ్యేలా కనిపించలేదు. కారణం అతను ఆమెకు అన్న వరసవుతాడు. 

దీంతో.. ఆ యువతికి మాయమాటలు చెప్పాడు. ఇంటి పేరు మార్చి చెప్పి.. వరుసకు బావ అవుతానని చెప్పి మోసం చేశాడు. అతన్ని నమ్మిన ఆ యువతి అమాయకంగా ప్రేమించింది. పెళ్లి కూడా చేసుకుంది. చివరికి కొద్ది రోజుల తరువాత ఆ యువతికి  అతను అన్న వరస అవుతాడని తెలిసింది. 

భద్రాద్రి జిల్లాలో విషాదం... పురుగులమందు తాగిన ప్రేమజంట, యువతి మృతి

అతని అసలు ఇంటిపేరు తెలియడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ యువతి షాక్ కు గురయ్యింది. వరుసకు అన్నయ్య అవుతాడని తెలిసి... ఆ నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనను కావాలని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని... తాను మోసపోయానని తెలుసుకుంది. అంతే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 

ఇది గమనించిన కుటుంబసభ్యులు యువతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా