భద్రాద్రి జిల్లాలో విషాదం... పురుగులమందు తాగిన ప్రేమజంట, యువతి మృతి

Arun Kumar P   | Asianet News
Published : Sep 21, 2021, 11:17 AM IST
భద్రాద్రి జిల్లాలో విషాదం... పురుగులమందు తాగిన ప్రేమజంట, యువతి మృతి

సారాంశం

ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. 

కొత్తగూడెం: వారిద్దరూ కొన్నేళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. అయితే తమ ప్రేమ పెళ్ళిపీటల వరకు వెల్లదని భావించిన ఈ జంట దారుణానికి పాల్పడింది. ఎలాగూ జీవితాంతం కలిసి బ్రతకలేం కాబట్టి కలిసి చద్దామనుకున్నారో ఏమో గానీ ఇద్దరూ పురుగులమందు తాగి  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళితే... భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం నెహ్రూనగర్ కు చెందిన శ్వేత(20) అదే గ్రామానికి చెందిన గుగులోత్ వెంకటేశ్ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకరంటే ఒకరికి ఇష్టపడటంతో వీరి ప్రేమ సాఫీగా సాగింది. ప్రేమించుకోడానికి అయితే ఇద్దరూ ఇష్టపడితే సరిపోతుంది... కానీ పెళ్లికి ఇరు కుటుంబాలు ఇష్టపడాలి.  ఎక్కడ తమ ప్రేమను పెద్దలు అంగీకరించరో అని భయపడిపోయిన ప్రేమజంట దారుణ నిర్ణయం తీసుకుంది. కలిసి బ్రతకలేమని భావించి కలిసి చద్దామని నిర్ణయించుకున్నారు.  

శ్వేత, వెంకటేశ్ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే శ్వేత అక్కడికక్కడే చనిపోగా వెంకటేశ్ మాత్రం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఖమ్మం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి కూడా విషమంగా వుంది. 

శ్వేత ఆత్మహత్యతో కుటుంబంలో విషాదఛాయిలు అలుముకున్నారు. ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం, యువతి మృతితో గ్రామంలోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం