పెళ్లింట విషాదం: అత్తారింటికి వెళ్తుండగా ప్రమాదం, నిన్న వరుడు.. నేడు వధువు మృతి

Siva Kodati |  
Published : Nov 25, 2021, 03:58 PM IST
పెళ్లింట విషాదం: అత్తారింటికి వెళ్తుండగా ప్రమాదం, నిన్న వరుడు.. నేడు వధువు మృతి

సారాంశం

హైదరాబాద్‌లో (hyderabad) విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి 24 గంటలు కూడా గడవకముందే నూతన వధూవరులు (newly bride groom) రోడ్డు ప్రమాదంలో (road accident) ప్రాణాలు కోల్పోయారు. 

హైదరాబాద్‌లో (hyderabad) విషాదం చోటు చేసుకుంది. పెళ్లయి 24 గంటలు కూడా గడవకముందే నూతన వధూవరులు (newly bride groom) రోడ్డు ప్రమాదంలో (road accident) ప్రాణాలు కోల్పోయారు. భర్తతో కలిసి వధువు పుట్టింటికి వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో తొలుత వరుడు మృతి చెందాడు. అదే యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడిన నవ వధువు చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచింది. 

Also Read:వివాహామైన 24 గంటలకే విషాదం: అత్తారింటికెళ్తుండగా రోడ్డు ప్రమాదం, పెళ్లికుమారుడు మృతి.. కోమాలో వధువు

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శివార్లలోని శేరిలింగంపల్లికి (serilingampally) చెందిన శ్రీనివాసులుకు (srinivasulu), తమిళనాడుకు (tamilnadu) చెందిన కనిమొళితో (kanimozhi )వివాహం జరిగింది.  తిరుపతిలో (tirupati) అంగరంగ వైభవంగా పెద్దల సమక్షంలో ఒక్కటైంది ఈ జంట. అనంతరం వధువు సొంతూరైన చెన్నైకి (chennai) భార్యాభర్తలిద్దరూ వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో నవవరుడు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇదే ప్రమాదంలో తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిన కనిమొళిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పెళ్ళైన 24 గంటలు గడవక ముందే శ్రీనివాసులు ప్రాణాలు పోగొట్టుకోగా.. చికిత్స పొందుతూ ఈరోజు వధువు కనిమొళి మరణించింది. దీంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్