పాదయాత్రకు రేవంత్ రెడ్డి రెడీ: జులై 7న ప్రమాణ స్వీకారం

Published : Jun 28, 2021, 08:09 AM IST
పాదయాత్రకు రేవంత్ రెడ్డి రెడీ: జులై 7న ప్రమాణ స్వీకారం

సారాంశం

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయన ఆదివారం ప్రకటించారు. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు తన పాదయాత్ర ఉంటుందని ఆయన చెప్పారు. అయితే, దానిపై అధిష్టానం ఆమోదం పొంది, కార్యక్రమాన్ని రూపొందించుకుంటానని రేవంత్ రెడ్డి చెప్పారు. 

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి జులై 7వ తేదీన పదవీబాధ్యతలు చేపట్టనున్నారు. పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. కాగా, రేవంత్ రెడ్డి నియామకంపై పలువురు సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి నాయకులు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంత మంది సీనియర్లు మౌనంగా ఉండిపోయారు. 

కరీంనగర్ జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు కె. సత్యనారాయణ, ఎన్ శ్రీధర్ (మేడ్చెల్), డాక్టర్ వంశీకృష్ణ (నాగర్ కర్నూలు), నర్సింహా రెడ్డి (రంగారెడ్డి), ఈ కొమరయ్య (పెద్దపల్లి), తదితరులు రేవంత్ రెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. మాజీ ఎంపీ ఎస్. రాజయ్య, బెల్లయ్య నాయక్, అద్దంకి దయాకర్ కూడా రేవంత్ రెడ్డిని కలిశారు. 

ఉమ్మడి నిర్ణయాలకే తాను ప్రాధాన్యం ఇస్తానని, వ్యక్తిగత నిర్ణయాలు చేయబోనని రేవంత్ రెడ్డి చెప్పారు. పార్టీ సుప్రీం అని ఆయన చెప్పారు. కార్యకర్తలు తమ కృష్టిని టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం దిశగా మళ్లించాల్సిన సమయమని ఆయన అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావును, వైఎస్ రాజశేఖర రెడ్డిని టీఆర్ఎస్ నేతలు దూషించడాన్ని ఆయన తప్పు పట్టారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?