రేవంత్ రెడ్డి నియామకంపై వ్యాఖ్యలు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అధిష్టానం ఆగ్రహం

By telugu teamFirst Published Jun 28, 2021, 7:01 AM IST
Highlights

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం మండిపడింది. ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా పరిగణిస్తోంది.

హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకానికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలను కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటోంది. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ ఆరా తీశారు. తెలంగాణ సీనియర్ నేతలతో ఫోన్ లో ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షడిగా రేవంత్ రెడ్డి నియమించడంపై కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఆదివారంనాడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఓటుకు నోటు కేసు మాదిరిగానే పీసీసీ నియామకం జరిగిందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానిపై పార్టీ అధిష్టానం తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది. మాణిక్యం ఠాగూర్ పార్టీ నేత మల్లు రవికి, ఏఐసిసి కార్యదర్సి బోసురాజులకు ఫోన్ చేశారు. 

అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడితే సహించేది లేదని మాణిక్యం ఠాగూర్ హెచ్చరించారు. కాగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై పలువురు నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి హైకమాండ్ కు పంపించారు.   

click me!