చిన్నారిపై ఎలకల దాడి

First Published Jun 6, 2018, 11:40 AM IST
Highlights

రక్తస్రావంతో చిన్నారి ఆర్తనాదాలు..మృతి

అప్పుడే పుట్టిన చిన్నారిని కన్న తల్లి చెత్తకుప్పలో పడేసి వెళ్లిపోయింది.  అక్కడికి చేరిన ఎలుకలు.. ఆ చిన్నారిపై దాడికి పాల్పడ్డాయి. వాటి దాడి తట్టుకోలేని చిన్నారి ఆర్తనాదాలు పెట్టింది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని నాచారంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నాచారంవిలేజ్-బాబానగర్ వెళ్లేదారిలో అప్పుడే పుట్టిన పసిపాపను మంగళవారం రాత్రి వదిలేసివెళ్లారు. బొడ్డుకొయని పసిపాపపై ఎలుకలు కొరికి రక్తస్రావంతో పసికందు అర్త నాదాలు చేసింది. మంగళవారం ఉదయం 3 గంటల ప్రాంతంలో నమాజ్ కోసం వెళ్తున్న ఎరుకలబస్తీ నాచారంకు చెందిన అహ్మద్, ఇదేప్రాంతం నుంచి వెళ్తున్న బవాచి హోటల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రిద్విందర్‌రెడ్డిలు పసికందు ఏడుపు విని పరిసరాలు గమనించాడు. 

నాచారం గ్రామ సమీపంలోని మసీద్ ప్రాం తంలో రోడ్డుపక్కన చెత్త, చెట్టుకొమ్మలు వేసిన ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందు కనిపించింది. అప్పటికే చిన్నారిపై ఎలుకలు దాడిచేసి గాయపరిచాయి. రక్తస్రావం అవుతుంది. ఇది గమనించిన అహ్మద్, ప్రిద్విందర్‌లు చిన్నారి పై దాడిచేసే ఎలుకలను తొలగించారు. 

వెంటనే 100కు ఫోన్ చేసి సమాచారం అందించి, 108కు ఫోన్‌చేశారు. విష యం తెలుసుకున్న నాచారం పోలీసులు, 108 సిబ్బంది రక్తస్రా వంతో అర్తనాదాలు చేస్తున్న పసికందును స్థానిక ప్రసాద్ దవాఖానకు తరలించారు. ప్రాథమిక చికిత్సను అందించి, మెరుగైన వైద్యం కోసం నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి ఉదయం 9 గంటల ప్రాంతంలో ప్రాణం వదిలింది. సంఘటన స్థలాన్ని నాచారం సీఐ విఠల్‌రెడ్డి, ఎస్సై కట్టా వెంకట్‌రెడ్డి పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు అడిగి గెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

click me!