ఆధార్ నంబర్, నీటిచుక్కలతో కొత్తరకం మోసం..

By AN TeluguFirst Published Dec 30, 2020, 11:31 AM IST
Highlights

రోజురోజుకూ మోసాలూ రూపం మార్చుకుంటున్నాయి. నేరస్తులు క్రియేటివిటీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. ఆధార్ నంబర్, వేలిముద్రల ఫొటో, నీటిచుక్కల సాయంతో పలువురు చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఏపీకి చెందిన రెవెన్యూ వెబ్ సైట్ నుంచి నిందితులు భూముల దస్తావేజులు డౌన్ లోడ్ చేసుకున్నారు. దస్తావేజుల్లో ఉన్న ఆధార్ కార్డు, వేలి ముద్రల ఫొటోలతో మధురానగర్ కు చెందిన సిద్ధిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తి బ్యాంకు అకౌంట్ లోని రూ. 10వేలు కాజేశారు.

ఈ మేరకు బాధితుడు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పేపాయింట్ ద్వారా డబ్బు స్వాహా చేసినట్టు నిందితులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. నిందితులు విశాల్, అర్షద్ లను సీఏ విద్యార్థులుగా గుర్తించారు. 

click me!