తెలంగాణ కరోనా అప్ డేట్: గుడ్ న్యూస్... ఐదు వేల దిగువకు యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Dec 30, 2020, 10:54 AM ISTUpdated : Dec 30, 2020, 11:06 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: గుడ్ న్యూస్... ఐదు వేల దిగువకు యాక్టివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ప్రభావం రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదవడం, రికవరీల సంఖ్య అధికంగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 5,878 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు  వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో 3,35 మంది హోం లేదా సంస్థల ఐసోలేషన్ లో వున్నట్లు తెలిపారు.

ఇక తెలంగాణలో తాజాగా చాలా తక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో(శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8 గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 45,590మందికి టెస్టులు చేయగా 474మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,85,939కి చేరగా టెస్టుల సంఖ్య 68,39,281కి చేరింది. 

ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 592 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,78,523కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్ల యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. 

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1538కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 96శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.40శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే జోగులాంబ గద్వాల 0 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట 1, కామారెడ్డి 4,  , ఆదిలాబాద్ 8, భూపాలపల్లి 6, జనగామ 6, జగిత్యాల 9, వనపర్తి 7, అసిఫాబాద్ 5, మహబూబ్ నగర్ 6, మహబూబాబాద్ 9, మెదక్ 7, నాగర్ కర్నూల్ 5,  నిర్మల్ 5, నిజామాబాద్ 8,  సిరిసిల్ల 6, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 6,  ములుగు 7, పెద్దపల్లి 10, సిద్దిపేట 14, సూర్యాపేట 10, భువనగిరి 9, మంచిర్యాల 14, నల్గొండ 11 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 102కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 45, రంగారెడ్డి 49, కొత్తగూడెం 18, కరీంనగర్ 29, ఖమ్మం 11,  సంగారెడ్డి 14, వరంగల్ అర్బన్  25కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

 

PREV
click me!

Recommended Stories

రేవంత్ రెడ్డి సమక్షంలో ఉగాది పంచాంగం | Ugadi Panchangam 2026 | Asianet News Telugu
Neem Trees: ఉగాది పూట వేప పువ్వు దొర‌క‌ని పరిస్థితి.. ఇంత‌కి వేప చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి.?