కారుకు జీపీఎస్ : భర్త హత్యకు పథకం, ప్రియుడి పాపభీతితో వెలుగులోకి దారుణం

Published : Mar 23, 2022, 09:57 AM ISTUpdated : Mar 23, 2022, 09:59 AM IST
కారుకు జీపీఎస్ : భర్త హత్యకు పథకం, ప్రియుడి పాపభీతితో వెలుగులోకి దారుణం

సారాంశం

మజ్జిగలో నిద్రమాత్రలు కలిసి.. ప్రియుడితో జంప్ అయిన వివాహిత కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట ఆమె ఒక్కతే కనిపించకుండా పోయింది. అనుమానం రాకుండా ప్రియుడు అయ్యప్పమాల వేసుకున్నాడు.. కానీ చివరికి.. పాపభీతి పట్టించింది.

నాగోల్ : చేతులకు మట్టి అంటకుండా మట్టుబెట్టడం.. కుటుంబ సభ్యులకు కూడా అనుమానం రాకుండా చంపడం వంటి నేరాలు  hyderabadలో కొత్త తరహాలో జరుగుతున్నాయి. రూ. కోట్లు కొట్టేసేందుకు, extramarital affairల్లో అడ్డు తొలగించేందుకు Sharpshooterలను రప్పిస్తున్నారు. కిరాయి హంతకులతో లక్షల్లో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. హత్య జరిగినప్పుడు పోలీసుల పరిశోధనలో ఇవి బయట పడడం కొన్నిసార్లు..  కొందరు బాధితులే పోలీసుల దృష్టికి తీసుకురావడంతో మరికొన్నిసార్లు వెలుగుచూస్తున్నాయి. Ibrahimpatnam పరిధిలో కొద్ది రోజుల క్రితం ఇద్దరు వ్యక్తులను సుపారీ తీసుకున్న హంతకులు దారుణంగా కాల్చి చంపారు. తాజాగా తన భర్తను చంపేందుకు ఎల్బీనగర్ ఉంటున్న మహిళ ప్రియుడిద్వారా నల్గొండ జిల్లాకు చెందిన రౌడీషీటర్లకు రూ.500000 సూపరీ ఇప్పించింది.

భర్త  కారుకు జిపిఎస్ అమర్చి.. మజ్జిగలో మత్తుమందు కలిపి..
ఎల్బీనగర్ ఠాణా పరిధిలోని మన్సూరాబాద్ లోని మధురానగర్ లో ఉంటున్న వెంకటేష్, హరిత వివాహేతరబంధాన్ని కొన్నేళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో హరిత భర్త భాస్కర్ సరస్వతి నగర్ కు మకాం మార్చాడు. అక్కడికి వెళ్ళినా హరిత, వెంకటేశ్ ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. ఇసుక వ్యాపారం చేస్తున్న భాస్కర్ ఎక్కువగా రాత్రివేళల్లో బయటికి వెళుతుండటంతో అతడి కారుకు  రహస్యంగా జిపిఎస్ అమర్చారు. భాస్కర్ బయటకు వెళ్లగానే వెంకటేష్ రహస్యంగా హరిత ఇంటికి వచ్చేవాడు.  

అయితే, ఇది గమనించిన ఇరుగుపొరుగువారు భాస్కర్ కు ఈ విషయాన్ని చెప్పడంతో అతను హరితతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె తన భర్తను చంపేయాలంటూ వెంకటేష్ కు చెప్పింది. మొదట ఒక్కతే ఇంట్లోంచి వెళ్తే.. తర్వాత భాస్కర్ని చంపేస్తాం అని అతను చెప్పాడు. పథకంలో భాగంగా ఈ నెల 16న ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. తరువాత ఈ ప్రణాళిక భాస్కర్ దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాలతో సహాయంతో హరిత, వెంకటేష్ ల ను అరెస్ట్ చేశారు.

పట్టించిన పాపభీతి...
హరిత భర్త భాస్కర్ ను చంపేందుకు వెంకటేష్ పథకం వేశాడు. ఆమె వెళ్ళిన తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అయ్యప్ప మాల వేశాడు. తెలిసిన నేరస్తుడు నవీన్ తో మాట్లాడాడు. రూ. మూడు లక్షల నగదు ఇచ్చాడు. హరిత వెళ్లి 2, మూడు రోజులైనా భాస్కర్ ను చెప్పకపోవడంతో వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు, దీంతో నవీన్ మరో రూ. రెండు లక్షలు ఇస్తే ఖచ్చితంగా కథలు చేస్తామంటూ చెప్పడంతో రూ.2 లక్షలు ఇచ్చాడు. ఈ డబ్బులు నల్గొండలో రౌడీషీటర్ రాజేష్ కు ఇచ్చాడు. భాస్కర్ ను చంపకపోవడంతో ఈసారి హరిత ఫోన్ చేసి చంపేస్తారా? లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

భాస్కర్ ను ఎందుకు చెప్పలేకపోతున్నామని అనుమానాన్ని వెంకటేష్ తన గురువు వద్ద వ్యక్తం చేశాడు.. దీనికి ఆయన అయ్యప్పమాల చేసినప్పుడు  ఇలాంటి పాపపు పనులు చేయకూడదు అంటూ చెప్పాడు. దీంతో వెంకటేశ్వర్లు పాపభీతి పెరిగింది. తన సన్నిహితులతో ఈ విషయం చెప్పగా వారు భాస్కర్ కు చేరవేయడంతో. పోలీసులకు సమాచారం అందడంతో  హరిత, వెంకట్, నవీన్ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి అరెస్ట్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 5 Biggest Airports in India : అతిపెద్ద విమానాశ్రయం మన హైదరాబాద్ దే.. ఎన్ని వేల ఎకరాల్లో ఉందో తెలుసా?
CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu