లోన్ యాప్స్ కేసులో ట్విస్ట్: వెలుగులోకి ఈడీ అధికారి లంచం బాగోతం, రంగంలోకి సీబీఐ

Siva Kodati |  
Published : Jun 02, 2021, 08:30 PM IST
లోన్ యాప్స్ కేసులో ట్విస్ట్: వెలుగులోకి ఈడీ అధికారి లంచం బాగోతం, రంగంలోకి సీబీఐ

సారాంశం

సంచలనం సృష్టించిన లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. లోన్ యాప్స్ ఎండీ దగ్గర నుంచి ఈడీ అధికారి ఒకరు లంచం తీసుకున్నట్లుగా తేలింది. ఈడీ అధికారిగా పనిచేస్తున్న లలిత్ బజార్డ్ బెంగళూరులో రూ.5 లక్షలు లంచం తీసుకున్నారు. 

సంచలనం సృష్టించిన లోన్ యాప్స్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. లోన్ యాప్స్ ఎండీ దగ్గర నుంచి ఈడీ అధికారి ఒకరు లంచం తీసుకున్నట్లుగా తేలింది. ఈడీ అధికారిగా పనిచేస్తున్న లలిత్ బజార్డ్ బెంగళూరులో రూ.5 లక్షలు లంచం తీసుకున్నారు. ఇందుకు ప్రతిఫలంగా సీసీఎస్ అధికారులు ఫ్రీజ్ చేసిన ఖాతాలను తెరిపించే ప్రయత్నం చేశారు. బెంగళూరులోని ఓ బ్యాంక్ ఖాతాకు సంబంధించి లావాదేవీలు జరిపినట్లు తేలింది.

Also Read:చైనా యాప్స్‌‌ వెనుక ఉగ్రకోణం..?, రంగంలోకి ఎన్ఐఏ

ముంబైకి చెందిన అపోలో ఫైన్ వెస్ట్ ఎండీ దగ్గరి నుంచి లలిత్ లంచం తీసుకున్నారు. ఈడీ అధికారి బాగోతంపై సీబీఐకి సమాచారం ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. బెంగళూరులోని పలు బ్యాంకులకు తప్పుడు పత్రాలు ఇచ్చి డబ్బులు రిలీజ్ చేయించారు లలిత్. ఈ నేపథ్యంలో బెంగళూరులో లలిత్ బజార్డ్ సీబీఐ కేసు నమోదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!