
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు. ఎల్లుండి ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే వారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా కప్పుకునే అవకాశం వుందని సమాచారం. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు పార్టీ అగ్రనాయకత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
Also Read:వైఎస్, రోశయ్య, కిరణ్‌లను కలిశారు.. అప్పుడు ఆత్మాభిమానం ఏమైంది: ఈటలపై పల్లా విమర్శలు
కాగా, ఈటల రాజేందర్ ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంటన మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా వున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు పెద్దలతో ఈటల భేటీ అయ్యారు. భూకబ్జా ఆరోపణలు రావడంతో కేబినెట్ నుండి ఈటల రాజేందర్ ను కేబినెట్ నుండి కేసీఆర్ తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలను ఈటల రాజేందర్ ను కలిశారు. గతకొన్ని రోజులుగా ఆయన బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. అటు బీజేపీ హైకమాండ్ కూడా ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకొనేందుకు సానుకూలంగా ఉంది.