పోలీస్ ల అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్

Published : Jan 22, 2018, 04:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
పోలీస్ ల అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్

సారాంశం

ఐదేళ్లుగా మా మధ్య పరిచయం ఉంది త్వరలో పెళ్లి చేసుకుందామనుకున్నాం అన్ని విషయాలను మీడియా ముందుకొచ్చి వివరిస్తాం

తెలంగాణలో సంచలనం సృష్టించిన పోలీసు పెద్దల అక్రమ సంబంధం కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆదివారం రాత్రి అవినీతి నిరోధక శాఖ అడిషనల్ ఎస్సీ సునీతారెడ్డి, కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున రెడ్డి అక్రమ సంబంధం వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి భర్త ఈ బండారాన్ని బయట పెట్టారు. అమెరికాలో ఉంటున్న ఆయన తన భార్య సునీతారెడ్డికి చెప్పకుండానే ఇండియా వచ్చి రెండురోజులపాటు మాటు వేసి మల్లిఖార్జునరెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విషయం తెలిసిందే. తర్వాత మల్లిఖార్జునరెడ్డికి చెప్పు దెబ్బలు, ఉరికించి కొట్టుడు షరా మామూలుగానే జరిగాయి. సునీతారెడ్డి భర్త, అత్త, తల్లి అందరూ కలిసే మల్లిఖార్జునరెడ్డిని చితకబాదారు.

అయితే ఈకేసులో అనూహ్య విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో దెబ్బలు తిన్న కల్వకుర్తి సిఐ మల్లిఖార్జునరెడ్డి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డితో తనకు గత ఐదేళ్లుగా పరిచయం ఉందని తెలిపాడు. అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని.. ఆమెకు డైవర్స్ వచ్చాక తాను ఆమె మ్యారేజ్ చేసుకోవాలన్నామని చెప్పాడు. ఆదివారం రాత్రి సునీతారెడ్డిని  డ్రాప్ చేయడం కోసమే ఆమె ఇంటికి వెళ్ళానని.. వేరే కారణాలేమీ లేవన్నారు. ఆదివారం రాత్రి గొడవ జరిగిన తర్వాత సైతం సునీతారెడ్డి భర్త కి అన్ని విషయాలు చెప్పామన్నాడు. తనకు ఆమెతో ఉన్నది ఇల్లీగల్ కాంటాక్ట్ కాదని.. అఫీషియల్ గా నే మ్యారేజ్ చేసుకుంటామని వెల్లడించాడు.

మల్లిఖార్జునరెడ్డి మరో విషయాన్న కూడా వెల్లడించాడు. తన భార్యతో తాను సఖ్యంగా లేనని.. చాలా కాలంగా తన భార్యతో దూరంగా ఉంటున్నట్లు చెప్పాడు. త్వరలోనే మీడియా ముందుకు ఇద్దరం వచ్చి అన్న విషయాలు చెబుతామని పేర్కొన్నాడు.

మొత్తానికి మల్లిఖార్జునరెడ్డి వెల్లడించిన విషయాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశాలున్నాయి. అయితే.. ఈ కేసులో అనేక చిక్కుముళ్ళు మాత్రం ఇంకా ఉన్నాయి. ఈ కేసు పోలీసు వ్యవస్థకే సవాల్ గా మారే పరిస్థితి కనబడుతోందని పోలీసు వర్గాల్లో టాక్ నడుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu
Harish Rao Serious Comments on Revanth Reddy | BRS VS CONGRESS | Politics | Asianet News Telugu