రాంకీ సంస్థపై ఐటీ సోదాల్లో కొత్తకోణం.. తనిఖీల వెనుక ‘‘సెబీ’’

By Siva KodatiFirst Published Jul 6, 2021, 4:16 PM IST
Highlights

వైసీపీ ఎంపీ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థపై ఐటీ సోదాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సెబి ఇచ్చిన సమాచారంతోనే ఐటీ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. రాంకీ కంపెనీలపై 20 చోట్ల సోదాలు నిర్వహించినట్లుగా సమాచారం

వైసీపీ ఎంపీ ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ సంస్థపై ఐటీ సోదాల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సెబి ఇచ్చిన సమాచారంతోనే ఐటీ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. రాంకీ కంపెనీలపై 20 చోట్ల సోదాలు నిర్వహించినట్లుగా సమాచారం. కొంతకాలం నుంచి రాంకీ షేర్ విలువ అనూహ్యంగా పెరిగింది. దీనిపై సెబీ నిఘా పెట్టింది. కంపెనీలో జరుగుతున్న పరిణామాలపై సెబీ అంతర్గత విచారణ చేపట్టింది. రాంకీ షేర్స్ విలువ పెరగడంపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది సెబీ. మలేషియాకు చెందిన కంపెనీకి నిధులు మళ్లీంచినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Also Read:వైసీపీ ఎంపీ ఇంట్లో ఐటీ సోదాలు: అయోధ్య రాంరెడ్డి సంస్థల్లో 15 చోట్ల తనిఖీలు

కాగా, వైసీపీకి చెందిన ఎంపీ  అయోధ్య రాంరెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు మంగళవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు. రాంకీ సంస్థల అధినేతగా ఆయన కొనసాగుతున్నారు. హైద్రాబాద్ మాదాపూర్ లోని రాంకీ ప్రధాన కార్యాలయంతో పాటు  హైద్రాబాద్ లోని 15 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి.రాంకీ సంస్థలతో పాటు రాంకీకి  అనుబంధంగా ఉన్న సంస్థల్లో కూడ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

click me!