ఘట్కేసర్ బీ ఫార్మసీ విద్యార్థిని కేసు కొత్త మలుపు: ఇది వరకు పెళ్లయిన ప్రియుడే...

Published : Apr 14, 2021, 07:20 AM ISTUpdated : Apr 14, 2021, 07:21 AM IST
ఘట్కేసర్ బీ ఫార్మసీ విద్యార్థిని కేసు కొత్త మలుపు: ఇది వరకు పెళ్లయిన ప్రియుడే...

సారాంశం

హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ లో కిడ్నాప్ డ్రామా ఆడి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న బీ ఫార్మసీ విద్యార్థిని కేసులో కొత్త విషయం వెలుగు చూసింది. ఆమె ఆత్మహత్యకు ప్రియుడే కారణమని తల్లి ఆరోపించింది.

ఘట్కేసర్: తెలంగాణలోని మేడ్చల్ - మాల్కాజిగిరి జిల్ాల ఘట్కేసర్ లో ఫిబ్రవరిలో కిడ్నాప్ డ్రామా ఆడి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న బీ ఫార్మసీ విద్యార్థిని కేసు మరో మలుపు తీసుకుంది. ఆ సంఘటనకు సంబంధించి కొత్త విషయం వెలుగు చూసింది. తన కూతురు ఆత్మహత్యకు ఆమె ప్రియుడే కారణమని విద్యార్థిని తల్లి ఆరోపించింది. 

ఘట్కేసర్ లో ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడింది. తన కూతురు ఆత్మహత్యకు కారణమైన ఆణె ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది. కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని రాంపల్లి ఆర్ఎల్ఆర్ నగర్ కు చెందిన ఓ యువకుడు తమ కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆమె చెప్పింది.

అప్పటికే అతనికి పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, మాయమాటలు చెప్పి తమ కూతురి జీవితాన్ని నాశనం చేశాడని చెప్పింది. ఆ యువకుడు, అతని స్నేహితురాలు తమ కూతురిని మానసికంగా, శారీరకంగా హింసకు గురి చేశారని ఆరోపించింది. దాన్ని భరించలేక బీపీ, షుగర్ మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుందని చెప్పింది. ఆ యువకుడితో తమ కూతురు కలిసి దిగిన ఫొటోలను ఆమె మీడియాకు అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే