పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటన: కేసును విత్ డ్రా చేసుకో.. మృతుడి బావమరిదికి బెదిరింపులు

By Siva KodatiFirst Published Jan 5, 2022, 9:18 PM IST
Highlights

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి. మృతుడి బావమరిది జనార్థన్‌రావును కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అనుచరులు బెదిరిస్తున్నారు. దీనిపై జనార్థన్ రావు ఏసీపీ రోహిత్ రాజుకు ఫిర్యాదు చేశారు. 
 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఆత్మహత్య చేసుకున్న రామకృష్ణ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయి. మృతుడి బావమరిది జనార్థన్‌రావును కేసు విత్ డ్రా చేసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ అనుచరులు బెదిరిస్తున్నారు. దీనిపై జనార్థన్ రావు ఏసీపీ రోహిత్ రాజుకు ఫిర్యాదు చేశారు. 

మరోవైపు Bhadradri Kothagudem district పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి మరో విషాదం చోటుచేసుకుంది. సోమవారం నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకోగా.. అతనితో పాటు భార్య, పెద్ద కూతురు మృతిచెందారు. నాగ రామకృష్ణ చిన్న కూతురు సాహితీకి తీవ్రగాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం సాహితీ మృతిచెందింది. దీంతో నాగ రామకృష్ణ కుటుంబంలో మృతుల సంఖ్య 4కి చేరింది. 

అసలేం జరిగింది..
పాత పాల్వంచ తూర్పు బజారులో నివాసం ఉండే రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి‌తో పాటు ఇద్దరు పిల్లలు సాహిత్య, సాహితీలు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో రామకృష్ణ దంపతులతో పాటుగా పెద్ద కూతరు సాహిత్య ఘటన స్థలంలోనే మృతిచెందారు. చిన్న కుమార్తె సాహితీ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రామకృష్ణ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్‌లో రామకృష్ణ.. తన చావుకు తల్లి సూర్యవతి, అక్క మాధవితో పాటుగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు (Vanama Venkateswara Rao) కుమారుడు వనమా రాఘవేంద్రరావు కారణమని పేర్కొన్నాడు. 

Also Read:పాల్వంచ కుటుంబ ఆత్మహత్య ఘటనలో మరో విషాదం

తన అక్క మాధవికి వివాహేతర సంబంధం ఉందని.. వారివల్ల తనకు అన్యాయం జరుగుతోందని రామకృష్ణ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. అందుకే ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనలో ఎమ్మెల్యే వనమా కుమారుడి పేరు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. గతంలో కూడా వనమా రాఘవేంద్ర వివాదాలకు కేరాఫ్‌గా ఉండటంతో అతనిపై చర్యలు తీసుకోవాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. నియోజకవర్గంలో Vanama Raghavendra Rao అరాచకాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. 

ఏ2గా వనమా రాఘవేంద్రరావు..
మరోవైపు ఆత్మహత్యకు పాల్పడిన రామకృష్ణ సెల్ఫీవీడియో, కుటుంబ సభ్యుల నుంచి  ఆధారాలు సేకరించి పోలీసులు కోర్టుకు అందజేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే వనమా రాఘవేంద్రరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో అతడిని ఏ2గా చేర్చారు. రాఘవేంద్రరావు ప్రస్తుతం పరారీలో ఉన్నారని పాల్వంచ ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. లొకేషన్ ట్రేస్ అవుట్ చేస్తున్నట్లు వెల్లడించారు. అతని కోసం స్పెషల్ టీమ్​లు గాలిస్తున్నాయని పేర్కొన్నారు.

తనకేం సంబంధం లేదని అంటున్న రాఘవేంద్రరావు..
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో తన పేరు రావడంపై వనమా రాఘవేంద్రరావు స్పందించారు. రామకృష్ణ కుంటుంబ సభ్యులంతా తనకు తెలిసిన వారేనని చెప్పారు. ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈ విషయంలో ఎలాంటి విచారణకు అయిన తాను సిద్దమేనని చెప్పారు. రామకృష్ణ లేఖలో తన పేరు ఎందుకు రాశారో అర్థం కావడం లేదన్నారు. ఈ మేరకు రామకృష్ణ ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.

click me!