టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. మే 23 నుంచి పరీక్షలు

Published : Mar 16, 2022, 01:01 PM ISTUpdated : Mar 16, 2022, 01:20 PM IST
టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. మే 23 నుంచి పరీక్షలు

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం పది పరీక్షల షెడ్యూల్ విడుదల చేసింది. మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్టు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రకటించింది.  

హైదరాబాద్: తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల అయింది. రాష్ట్రవ్యాప్తంగా మే నెల 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ షెడ్యూల్‌ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. పది పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.

పదో తరగతి పరీక్షల టైం టేబుల్ ఇలా ఉన్నది. మే 23న అంటే సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. ఆ తర్వాత వరుసగా 24వ తేదీన సెకండ్ లాంగ్వేజ్, 25న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) పరీక్షలు ఉండనున్నాయి. మే 26వ తేదీన అంటే గురువారం గణితం, 27న జనరల్ సైన్స్ పేపర్ (భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం) ఎగ్జామ్, 28న సాంఘిక శాస్త్రం పరీక్ష నిర్వహించనున్నారు. మే 30వ తేదీన అంటే సోమవారం ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం, అరబిక్), మే 31వ తేదీన ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం, అరబిక్) పరీక్షలు ఉంటాయి. కాగా, జూన్ 1వ తేదీన చివరి ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) ఉంటుంది. ఈ ఒక్క పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఉంటుంది. ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) మినహా అన్ని పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ