పోలీసుల మూడో కన్ను కమాండ్ కంట్రోల్‌: ఆగష్టు 4న ప్రారంభించనున్న కేసీఆర్

By narsimha lode  |  First Published Jul 28, 2022, 1:51 PM IST

ఈ ఏడాది ఆగష్టు 4న పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ విషయమై తెలంగాణ డీజీపీ సహా పోలీస్ అధికారులు గురువారం నాడు ఏర్పాట్లను పరిశీలించారు. 
 


హైదరాబాద్: ఈ ఏడాది ఆగష్టు 4వ తేదీన  పోలీస్ కమాండ్ కంట్రోల్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.  Police Command Control Centre భవనం ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం నాడు తెలంగాణ డీజీపీ Mahender Reddy, పోలీసు ఉన్నతాధికారులు గురువారం నాడు సమీక్షించారు. 

రాష్ట్రంలో ఉన్న CC Camera లను పోలీస్ కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో కమాండ్ కంట్రోల్ కు సమాచారం అందనుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్  సెంటర్ 14వ అంతస్థుల్లో నిర్మించారు. కమాండ్ కంట్రోల్ లోని రెండు అంతస్థుల్లోకి ప్రజలను అనుమతించే అవకాశం ఉంది.

Latest Videos

undefined

దేశంలో ఈ తరహా సెంటర్ ఇదే మొదటిదని పోలీస్ అధికారులు చెబుతున్నారు.  పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనంపై హెలిపాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ ను ఏ,బీ, సీ, డీ భాగాలుగా నిర్మించారు.  మొత్తం 1లక్షా 12 వేల 7 చదరపు కి.మీ విస్తీర్ణంలో  కమాండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మించారు. ఈ భవనం నిర్మాణానికి సుమారు రూ. 580 కోట్లకుపైగా ఖర్చు చేశారు. పోలీస్ కమాండ్ కంట్రోల్  భవనంలో 14, 15 అంతస్తులో సామాన్యులు ప్రవేశించేందుకు అనుమతిని ఇవ్వనున్నారు పోలీసులు.

 ఈ సెంటర్  కు ఎడమ వైపున ఉన్న ఏ టవర్ లో  Hyderabad పోలీస్ కమిషనర్ కార్యాలయంతో పాటు పరిపాలన విభాగాలను కలిగి ఉంటుంది.బీ టవర్ లో రాష్ట్రంలోని ప్రతి సీసీకెమెరాను ఈ సెంటర్ తో అనుసంధాంచారు. అంతేకాదు షీ టీమ్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ తో పాటు పలు ఏజెన్సీలు, హాక్ ఐ అసిస్టెన్స్  ఉంటాయి.

ఆపదలో ఉన్న వ్యక్తుకు సహాయం చేయడానికి అత్యవసరంగా ప్రతిస్పందించే నిర్వహణ వ్యవస్థ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. సిబ్బంది సామర్ధ్యాన్ని పెంచడానికి ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్సీని కూడా కలిగి ఉంది.

నేరాల నిర్మూలనకు తెలంగాణ పోలీసులు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు.  దేశంలో అనేక సంచలన కేసులను కూడా Telangana పోలీసులు టెక్నాలజీని ఉపయోగించి అతి తక్కువ రోజుల్లోనే చేధించ విషయం తెలిసిందే. పోలీస్ కమాండ్ కంట్రల్ ప్రారంభమైతే నేరాల అదుపునకు పోలీసుల విధులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.సింగపూర్, న్యూయార్క్ లలో మాత్రమే ఈ తరహా సౌకర్యాలున్నాయని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హోంమంత్రితో పాటు డీజీపీకి, ఇతర అధికారులకు కూడా వేర్వేరు గా చాంబర్లు ఏర్పాటు చేశారు. ఏడో అంతస్తులో వార్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ రూమ్ లో సమావేశాలు ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో వరదల పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం ఇక్కడి నుండే చేసుకొనేలా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేశారు.టవర్ సీ లో బహుళ ఏజెన్సీ గదితో పాటు ఆడిటోరియం ఉంది. మరో వైపు టవర్ డీ లో ఇతర విభాగాలు, డేటా సెంటర్  ల భవనాలున్నాయి.పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని పోలీసులు మూడో కన్నుగా భావిస్తున్నారు. ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో సమాచారాన్ని చేరవేసేలా టెక్నాలజీతో కమాండ్ కంట్రోల్ భవనాన్ని అనుసంధించారు. దీంతో ఈ భవనాన్ని మూడో కన్నుగా పోలీస్ శాఖ భావిస్తుంది.

click me!