కేసీఆర్ కొలువులో కొత్త మంత్రులు వీరే: ఆఖరు నిమిషంలో ఈటెల పేరు ఖరారు

By telugu teamFirst Published Feb 18, 2019, 11:21 PM IST
Highlights

మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజభవన్ లో పదిమంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.  రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న తొలి కేబినెట్ విస్తరణలో ఎవరెవరికీ అవకాశం దక్కనుందనే దానిపై సస్పెన్స్ వీడిపోయింది. 

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది.  మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజభవన్ లో పదిమంది మంత్రులు ప్రమాణం స్వీకారం చేయనున్నారు.  రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న తొలి కేబినెట్ విస్తరణలో ఎవరెవరికీ అవకాశం దక్కనుందనే దానిపై సస్పెన్స్ వీడిపోయింది. 


ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస గౌడ్, ఈటెల రాజేందర్  కేసీఆర్ కొలువులో చేరనున్నారు. ఈటెల రాజేందర్ పేరు చివరి నిమిషంలో ఖరారైనట్లు తెలుస్తోంది.

సామాజికవర్గాల వారీగా చూసుకుంటే రెడ్డి  సామాజికవర్గం నుంచి ఐదుగురు, బీసీ నుంచి ముగ్గురు, ఎస్సీ నుంచి ఒకరు, వెలమ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. 

వీరిలో కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్ గౌడ్ తొలిసారిగా మంత్రులుగా ప్రమాణం చేయనుండటం విశేషం.

ఎవరికి ఏ శాఖ...

కేసీఆర్: నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖలు
నిరంజన్ రెడ్డి : ఆర్థిక శాఖ
శ్రీనివాస్ గౌడ్ : - ఎక్సైజ్, సంక్షేమ శాఖ
తలసాని శ్రీనివాస్: పశు సంవర్ధక శాఖ
ఎర్రబెల్లి దయాకర్ రావు : రోడ్లు భవనాల శాఖ
జగదీశ్వర్ రెడ్డి : విద్యా, విద్యుత్ శాఖలు
ప్రశాంత్ రెడ్డి : వ్యవసాయం, మార్కెటింగ్
కొప్పుల ఈశ్వర్ : పంచాయితీ రాజ్‌ శాఖ(కొప్పులకు ఏ శాఖ అనేదానిపై పూర్తి స్పష్టత లేదు)
మల్లారెడ్డి : రవాణా శాఖ
ఇంద్రకరణ్ రెడ్డి : వైద్యం, ఆరోగ్యశాఖ

click me!
Last Updated Feb 18, 2019, 11:34 PM IST
click me!