Covid JN.1 : భారత్ లో కరోనా కొత్త వేరియంట్ కలకలం... తెలంగాణలో అలర్ట్  

By Arun Kumar PFirst Published Dec 19, 2023, 8:07 AM IST
Highlights

దేశంలో కరోనా న్యూ వేరియంట్ జెఎన్.1 కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. 

హైదరాబాద్ : కరోనా మహమ్మారి మనుషులను వదిలిపెట్టడం లేదు. యావత్ ప్రపంచాన్ని మళ్లీ భయపెడుతూ కరోనా కొత్త వేరియంట్ విస్తరిస్తోంది. చైనా, అమెరికా, యూకే, ప్రాన్స్... ఇలా ఇప్పటికే 38 దేశాల్లో వ్యాప్తి చెందుతున్న కరోనా జేఎన్.1 కొత్త వేరియంట్ భారత్ లోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే కేరళలో ఈ కరోనా కొత్త వేరియంట్ కేసు బయటపడింది. దీంతో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. 

కేంద్ర ప్రభుత్వం కొత్త కరోనా వేరియంట్ హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయ్యింది.గతంలో కరోనా రోగులకు సేవలు అందించిన హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వైద్యసేవల కోసం ఏర్పాట్లు చేసారు. కరోనా జేఎన్.1 వేరియంట్ సోకినవారికి చికిత్స అందించేందుకు సిద్దంగా వున్నట్లు గాంధీ డాక్టర్ల తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా 50 పడకలను సిద్దం చేసినట్లు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెల్లడించారు. 

Latest Videos

ఈ వైరస్ సోకితే జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కన్పిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఈ కొత్త వేరియంట్ జేఎన్.1 వైరస్ వ్యాప్తి చెందకుండా తరచుగా శానిటైజర్ తో చేతులను శుభ్రపర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మళ్లీ ప్రజలు తప్పనిసరిగా మాస్కులు వాడాలని... సామాజిక దూరం పాటించాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. 

Also Read  పెరుగుతున్న కరోనా కేసులు: అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచన

ముఖ్యంగా ఈ కొత్త వేరియంట్ కరోనాతో వృద్దులు, ధీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు అప్రమత్తంగా వుండాలని వైద్య నిపుణులు  సూచిస్తున్నారు. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రద్దీగా వుండే ప్రాంతాలకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 
 

click me!