తెలంగాణకు కొత్త సీఎం: తెలుపు రంగులో కొత్త కాన్వాయ్

Published : Dec 04, 2023, 05:28 PM ISTUpdated : Dec 04, 2023, 05:37 PM IST
తెలంగాణకు కొత్త సీఎం: తెలుపు రంగులో  కొత్త కాన్వాయ్

సారాంశం

తెలంగాణకు కొత్త సీఎంకు  కొత్త కాన్వాయ్ ను అధికారులు సిద్దం చేశారు.  కొత్త సీఎంకు  ఆరు వాహనాలను జీఏడీ రెడీ చేసింది. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే  ఆరు వాహనాల కాన్వాయ్ లో  వెళ్లేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.  

హైదరాబాద్: తెలంగాణ కొత్త సీఎంకు  కొత్త కాన్వాయ్  వచ్చింది.  ఆరు కొత్త వాహనాలను తెలంగాణ జీఏడీ తీసుకు వచ్చింది.  సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే  కొత్త కాన్వాయ్ లో  సీఎంగా  వెళ్లేందుకు వీలుగా  వాహనాలను  సిద్దం చేశారు.  వైట్ కలర్ వాహనాలను  జీఏడీ తీసుకు వచ్చింది.  సీఎల్పీ నేతపై కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయం తీసుకొంటే  ఇవాళ రాత్రికి  ప్రమాణం చేసే అవకాశం ఉంటుంది. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో  సోమవారంనాడు  కాంగ్రెస్ శాసనసభపక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష నేతను ఎంపిక చేసే బాధ్యతను అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ  నిర్ణయం తీసుకున్నారు.  ఇవాళ రాత్రికి కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం  తెలంగాణలో సీఎల్పీ నేతపై నిర్ణయం తీసుకోనున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలతో విడివిడిగా కూడ  అభిప్రాయాలను కూడ సేకరించారు  కాంగ్రెస్ నేతలు.  సీఎల్పీ సమావేశానికి  పరిశీలకులుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, దీపాదాస్ మున్షీ , మురళీధరన్ తదితరులు  విడివిడిగా ఎమ్మెల్యేలతో మాట్లాడారు.  సీఎల్పీ నేతగా ఎవరుంటే పార్టీకి ప్రయోజనమనే విషయమై  ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు.  ఎమ్మెల్యేల అభిప్రాయాలను కూడ  కాంగ్రెస్ నేతలు  కాంగ్రెస్ నాయకత్వానికి పంపారు.

also read:ముగిసిన CLP Meetting: సీఎల్పీనేత ఎంపిక బాధ్యత మల్లికార్జున ఖర్గేకు అప్పగింత

ఇవాళ జరిగిన సీఎల్పీ సమావేశంలో  సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ అఖిలభారత అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ  నిర్ణయం తీసుకున్నారు.ఈ తీర్మానాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  ప్రతిపాదించారు.ఈ తీర్మానాన్ని  కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి,  సీతక్క,తుమ్మల నాగేశ్వరరావు, ప్రేం సాగర్ రావు తదితరులు బలపర్చారు. 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?