రెండో ప్రియుడ్ని సోదరుడిగా చూపించి.. ఫస్ట్ లవర్‌తో కీర్తి డ్రామా

By narsimha lode  |  First Published Oct 31, 2019, 1:54 PM IST

ప్రియుడు శశి ప్రేరణతో  తల్లిని చంపిన కేసులో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న కీర్తిని హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో కీర్తిని రెండో ముద్దాయిగా తేల్చారు



హైదరాబాద్: ప్రియుడు శశి ప్రేరణతో  తల్లిని చంపిన కేసులో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న కీర్తిని హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో కీర్తిని రెండో ముద్దాయిగా తేల్చారు. ఈ కేసులో ఏ1 గా శశికుమార్ ను పోలీసులు చేర్చారు.

శశికుమార్ ను బాల్ రెడ్డికి తన సోదరుడిగా  కీర్తి పరిచయం చేసింది. బాల్ రెడ్డి, కీర్తి మధ్య వివాహేతర సంబంధాన్ని తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించి శశికుమార్ కీర్తిని లోబర్చుకొన్నాడు. 

Latest Videos

Also Read: ఒకరికి బ్రేకప్, మరొకతనితో లవ్: అమ్మను చంపి దొరికాక ఏడ్చేసిన కీర్తి

ఈ నెల 19వ తేదీన ప్రియుడు శశితో కలిసి తల్లి రజితను కీర్తి దారుణంగా హత్య చేసింది. శవాన్ని  రామన్నపేటలోని రైలు పట్టాలపై వదిలేసి వచ్చారు.కీర్తిపై కన్నేసిన శశికుమార్  తల్లి రజితను తప్పిస్తే కానీ ఆమె దక్కదని భావించారు. 

Also Read: లవ్ అఫైర్, తల్లిని చంపిన కీర్తి ఈమెనే: తండ్రి ఏమన్నారంటే

ఈ మేరకు శశి కీర్తిని తల్లిని హత్య చేసేలా ప్రేరేపించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఏడాది జనవరి మాసంలో బాల్‌రెడ్డి అత్యాచారం చేయడంతో కీర్తి గర్భం దాల్చింది. దీంతో కీర్తి అబార్షన్ చేయించాలని బాల్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చింది.

Also Read: ఇద్దరితో లవ్: తల్లిని చంపి శవం పక్కనే మూడు రోజులు ప్రియుడితో. 

ఈ క్రమంలోనే శశికుమార్ ను బాల్‌రెడ్డికి సోదరుడిగా పరిచయం చేసింది. ఈ ముగ్గురు కలిసి ఆమన్‌గల్‌లో కీర్తి అబార్షన్ చేయించుకొంది.  కీర్తి అబార్షన్ చేయించుకొన్న విషయం తెలిసిన శశికుమార్  కీర్తిని బ్లాక్ మెయిల్ చేశాడు.  కీర్తితో శారీరక సంబంధం ఏర్పర్చుకొన్నాడు. కీర్తితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడీయోలు తీశాడు.

కీర్తి పేరున నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి విలువ కోట్లలో ఉంది. దీంతో శశి కుమార్  కీర్తి తల్లి రజితను తప్పిస్తే కీర్తితో పాటు ఆమె ఆస్తి కూడ తనకు దక్కుతోందని భావించి రజితను హత్య చేసేలా కీర్తిపై ఒత్తిడి తెచ్చినట్టుగా పోలీసులు తేల్చారు.

తాను చెప్పినట్టుగా వినకపోతే తనతో సన్నిహితంగా ఉన్న పోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని శశికుమార్  కీర్తిని బెదిరించాడు. ఈ నెల 19వ తేదీన రజిత తన కూతురు కీర్తిపై చేయి చేసుకొంది. దీంతో  శశికుమార్ ప్రేరణతో కీర్తి తల్లి రజితను హత్య చేసింది. 

కీర్తికి సంబంధించిన ఆస్తిపై కన్నేసిన శశికుమార్  కీర్తి తల్లి రజిత అడ్డు తొలగించుకోవాలని భావించారు. ఈ మేరకు శశికుమార్  కీర్తిని ప్రేరేపించి రజితను హత్య చేయించేలా ప్రేరేపించినట్టుగా పోలీసులు విచారణలో తేల్చారు. ఈ కేసు విషయమై కీర్తితో పాటు శశికుమార్ ను పోలీసులు గురువారం నాడు మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

click me!