శంషాబాద్ విమానాశ్రయంలో ఉద్యోగం పేరిట... యువతిని మోసగించిన కేటుగాళ్లు

By Arun Kumar PFirst Published Jul 16, 2021, 12:00 PM IST
Highlights

విమానాశ్రయంలో ఉద్యోగం పేరిట ఓ యువతిని నమ్మించి మోసగించారు కేటుగాళ్ళు. మోసపోయిన యువతి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం బయటపడింది. 

హైదరాబాద్: ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగం పేరిట ఓ నిరుద్యోగ యువతిని ట్రాప్ చేసిన కొందరు సైబర్ నేరగాళ్లు నగదు దోచుకున్నారు. మోసపోయానని గ్రహించిన హైదరాబాద్ యువతి సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయండంతో ఈ మోసం గురించి బయటపడింది.  

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లో వుంటున్న ఓ నిరుద్యోగ యువతి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోని ఇటీవల వివిధ జాబ్ సైట్లలో తన వివరాలను పొందుపర్చింది. ఈ వివరాలను సేకరించిన సైబర్ నేరగాళ్లు ఆమెను బురిడీ కొట్టించారు. 

read more వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో... యువతిని వేధిస్తున్న స్నేహితురాళ్లు, రంగంలోకి సైబర్ క్రైమ్

ఇటీవల సదరు యువతికి ఫోన్ కాల్ వచ్చివది. తాము క్వికర్ (Quikr)డాట్ కామ్ నుండి  కాల్  చేస్తున్నామని... శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీకు జాబ్ కన్ఫామ్ అయిందంటూ యువతిని తెలిపారు. వారి మాయమాటలను యువతి నమ్మింది. అయితే ఈ జాబ్ కోసం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలంటూ సైబర్ కేటుగాళ్లు యువతి నుండి లక్షకుపైగా నగదును తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. త్వరలోనే అపాయింట్ మెంట్ ఆర్ఢర్ వస్తుందని... ఆ తర్వాత జాబ్ లో జాయిన్ కావాలని తెలిపారు. 

అయితే రోజులు గడుస్తున్నా అపాయింట్ మెంట్ ఆర్డర్ రాకపోవడంతో బాధిత యువతి వారికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన యువతి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

click me!