కేసిఆర్ పై సోషల్ మీడియాలో చురకలు షురూ

Published : Oct 06, 2017, 06:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
కేసిఆర్ పై సోషల్ మీడియాలో చురకలు షురూ

సారాంశం

కేసిఆర్ తిట్ల దండకానికి సోషల్ మీడియా కౌంటర్ పోస్టుల మోత మోగిస్తున్న నెటిజన్లు

తెలంగాణ సిఎం కేసిఆర్ ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సింహభాగం జెఎసి ఛైర్మన్ కోదండరాం ను తిట్టేందుకే ప్రయత్నించారు. రెండు గంటలకు పైగా సాగిన ప్రెస్ మీట్ లో కోదండరాం పై బూతుల వర్షం కురిపించారు. వాడు, వీడు, లంగా, అరే బాబూ ఇలాంటి భాషలో ధూషించారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను కూడా గట్టిగానే అర్సుకున్నరు కేసిఆర్. సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు వస్తున్నాయని, ఎవరినీ వదిలే ప్రశ్నే లేదని హెచ్చరించారు.

ఈ తరుణంలో సోషల్ మీడియా కౌంటర్ షురూ చేసింది. నెటిజన్లు అప్పుడే కేసిఆర్ కు చురకలు వేస్తూ పోస్టుల సునామీ మొదలు పెట్టారు.

తాజాగా ఈ పోస్టు సోషల్ మీడియాలో విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరూ ఆ పోస్టు చూడండి. కింద ఉంచినం.

ఇది కొద్దిగా ఘాటుగా పెట్టిన పోస్టు. డిఎస్సీ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆగ్రహం ఈ పోస్టులో కనబడుతోంది.

చూడండి కింద ఇచ్చినం.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/yhm1Ku

 

PREV
click me!

Recommended Stories

School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!