యాదాద్రిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు: 1.16 కిలోల బంగారం సమర్ఫణ

By narsimha lode  |  First Published Sep 30, 2022, 2:40 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారి ఆలయానికి 1.16 కిలోల బంగారాన్ని విరాళంగా అందించారు సీఎం కేసీఆర్.
 


హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సీఎం కేసీఆర్ వెంట  ఆయన సతీమణి శోభ, మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి , ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులుlన్నారు.

యాదాద్రి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం సీఎం కేసీఆర్ 1.16 కిలోల బంగారాన్ని ఆలయానికి విరాళంగా ఇచ్చారు సీఎం కేసీఆర్.  స్వర్ణ తాపడం కోసం 120 కిలోల బంగారం అవసరం అవుతుంది. దీని కోసం విరాళాలు సేకరించనున్నారు. ఇప్పటికే రూ. 7 కోట్ల నగదు 20 కిలోల బంగారం విరాళ:గా దేవాలయానికి వచ్చింది. 

Latest Videos

undefined

హైద్రాబాద్ నుండి వచ్చిన సీఎం కేసీఆర్ తొలుత ప్రెసిడెంట్ సూట్ లో ఉన్నారు. ఈ సూట్ నుండి కేసీఆర్ నేరుగా ఆలయం పైకి చేరుకున్నారు. ఆలయంపైకి వచ్చిన కేసీఆర్ కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలిారు. తొలుత ఆలయం చుట్టూ  ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం గర్బగుడిలో పలువురు ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం కోసం విరాళాలు అందించారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎం కేసీఆర్ సహా పలవురికి ఆశీర్వచనాలు అందించారు. 

click me!