మళ్లీ నక్సలిజం వ‌స్తుంది.. కేసీఆర్ పాల‌న‌పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

By Mahesh Rajamoni  |  First Published Apr 15, 2023, 4:21 PM IST

Hyderabad: భారత రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పాల‌న‌లో మ‌ళ్లీ న‌క్స‌లిజం వ‌స్తుంద‌ని కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ప్ర‌జ‌లు మ‌ళ్లీ తుపాకులు ప‌ట్టే రోజులు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ఉద్యోగ భ‌ర్తీల‌కు సంబంధించి పేప‌ర్ లీకేజీల‌తో ల‌క్ష‌లాది మంది రోడ్డునప‌డ్డార‌ని ప్రభుత్వంపై మండిప‌డ్డారు. 
 


Congress leader Mohammad Ali Shabbir: ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని భారత రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) పాల‌న‌లో మ‌ళ్లీ న‌క్స‌లిజం వ‌స్తుంద‌ని కాంగ్రెస్ నాయ‌కుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యాలు చేశారు. ప్ర‌జ‌లు మ‌ళ్లీ తుపాకులు ప‌ట్టే రోజులు వ‌స్తాయ‌ని పేర్కొన్నారు. ఉద్యోగ భ‌ర్తీల‌కు సంబంధించి పేప‌ర్ లీకేజీల‌తో ల‌క్ష‌లాది మంది రోడ్డునప‌డ్డార‌ని ప్రభుత్వంపై మండిప‌డ్డారు. రాష్ట్రంలోని యువ‌త‌కు ఉద్యోగాలు లేవు కానీ, ఆయ‌నకు సంబంధించిన వారికి మాత్రం ఉద్యోగాలు, ఉపాధి దొరికింద‌ని కేసీఆర్ ను  విమ‌ర్శించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) ప్ర‌శ్నాప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారం తీవ్ర దుమారం రేపుతోంది. పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న అభ్య‌ర్థులు, రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు వివిధ వ‌ర్గాల వారు రాష్ట్ర ప్ర‌భుత్వం తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఏర్పాటైన టీఎస్ పీఎస్ సీ పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ స‌మావేశ‌మైంది. కామారెడ్డి జిల్లాలో టీఎస్ పీఎస్ సీ పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో టీఎస్ పీఎస్ సీ పేపర్ల లికేజీ ప్రభుత్వ వైఫల్యం నిరుద్యోగ గోస-అఖిలపక్ష పార్టీల భరోసా రౌండ్ టేబుల్ సమావేశంలో ష‌బ్బీర్ అలీ కూడా పాలుపంచుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌దాడి కొన‌సాగించారు. 

Latest Videos

సీఎం కేసిఆర్ పాలనలో మళ్లీ నక్సలిజం వస్తుందని, మళ్లీ తుపాకీ పట్టే రోజులు వస్తాయంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ ప్ర‌భుత్వం తీరువ‌ల్ల పేప‌ర్ లీకేజీ జ‌రిగింద‌నీ, దీని కార‌ణంగా ల‌క్ష‌లాది మంది రోడ్డున‌ప‌డ్డార‌ని పేర్కొన్నారు. రాష్ట్ర నిరుద్యోగ యువ‌త ఉపాధి, ఉద్యోగాల కోసం గ‌త తొమ్మిది సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ ద‌గ్గ‌రివారికి మాత్రం ఉద్యోగాలు ల‌భిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ రాసిన రాజ్యాంగం కాకుండా కేసీఆర్ రాజ్యాంగం రాష్ట్రంలో న‌డుస్తోంద‌ని ఆరోపించారు. పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారం గురించి మాట్లాడుతూ.. ప్ర‌భుత్వ సిట్ విచార‌ణ‌పై న‌మ్మ‌కం లేద‌నీ, దీనిపై సిట్టింగ్ జ‌డ్జీతో విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. 

అంత‌కుముందు, ఇఫ్తార్ విందు సందర్భంగా ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు కేసీఆర్ ప్రయత్నించారని  మహ్మద్ అలీ షబ్బీర్ ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో ముస్లింలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు ఆగిపోయిందన్నారు. ఇఫ్తార్ విందులో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పదేళ్లలో మైనార్టీల సంక్షేమానికి రూ.1,200 కోట్లు ఖర్చు చేసిందని, టీఆర్ ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో మైనార్టీల సంక్షేమానికి రూ.12 వేల కోట్లు కేటాయించిందన్నారు. షబ్బీర్ అలీ మాట్లాడుతూ మొత్తం బడ్జెట్ పరంగా మైనార్టీలకు నిధుల కేటాయింపును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ రూ.85 వేల కోట్లు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్ రూ.2.56 లక్షల కోట్లకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి బడ్జెట్ రూ.5.56 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. 

తెలంగాణ జనాభాలో మైనార్టీలు 14 శాతం ఉన్నారని, కానీ బడ్జెట్ లో కేవలం రూ.2,200 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. కేసీఆర్ కు నిజంగా మైనార్టీల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే మొత్తం బడ్జెట్ లో 14 శాతాన్ని మైనార్టీ సంక్షేమానికి కేటాయించి ఉండాల్సింది. ఇఫ్తార్ విందులో ముస్లింలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేసి జాతీయ రాజకీయాల్లో పాల్గొనే అజెండాను సమర్పించారని విమ‌ర్శించారు.

click me!