హైద్రాబాద్‌లో భారీగా డ్రగ్స్ సీజ్: ముంబైకి చెందిన నలుగురి అరెస్ట్

By narsimha lode  |  First Published Feb 14, 2023, 9:42 AM IST

హైద్రాబాద్ లో మంగళవారం నాడు భారీగా డ్రగ్స్  ను సీజ్ చేశారు  పోలీసులు. నిందితులు  ముంబైకి  చెందినవారుగా పోలీసులు తెలిపారు.  


హైదరాబాద్: నగరంలో  భారీగా డ్రగ్స్  ను పట్టుకున్నారు  హైద్రాబాద్  పోలీసులు.  ముంబైకి చెందిన నలుగురు డ్రగ్స్  స్మగ్లర్లను  పోలీసులు  అరెస్ట్  చేశారు.  నిందితుల  నుండి 200 గ్రాముల  ఎండీఎంఏతో పాటు  గంజాయిని కూడా  పోలీసులు సీజ్ చేశారు. హైద్రాబాద్ నగరంలోని  పలువురు ప్రముఖులకు  నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.  

హైద్రాబాద్ నగరంలో  డ్రగ్స్ విక్రయిస్తూ  పలువురు  పోలీసులకు  చిక్కుతున్నారు.  డ్రగ్స్ , గంజాయి  ఇతర  మత్తు పదార్దాలు విక్రయిస్తున్నవారిపై పోలీస్, ఎక్సైజ్ శాఖ నిఘాను ఏర్పాటు  చేసింది.   ముంబై,  గోవా ప్రాంతాల్లో  హైద్రాబాద్  పోలీసులు  పెద్ద దాడులు నిర్వహించి  డ్రగ్స్  విక్రయిస్తున్నవారిని  పోలీసులు అరెస్ట్  చేశారు. అంతేకాదు  డ్రగ్స్  కొనుగోలు  చేస్తున్నవారిపై  కూడ పోలీసులు కేసులు నమోదు  చేశారు.

Latest Videos

ఈ ఏడాది జనవరి  21న  సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో  డ్రగ్స్ దందా నిర్వహిస్తున్న  ముఠాను పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ముఠాలో  సభ్యులపై గతంలో కూడా  కేసులు నమోదయ్యాయి.  

2022 డిసెంబర్ 1వ తేదీన రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్,  నందిగామల్లో  గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న  ముఠాను  పోలీసులు  అరెస్ట్  చేశారు.  నలుగురు ముఠా సభ్యులు గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్టుగా  పోలీసులు తెలిపారు.

హైద్రాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న   డాక్టర్ ను  పోలీసులు  ఈ ఏడాది జనవరి  13న అరెస్ట్  చేశారు.  డెంటల్ క్లినిక్ ను నిర్వహిస్తున్న డాక్టర్  కొరియర్ ద్వారా డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్టుగా  పోలీసులు తెలిపారు.  

ఈ ఏడాది జనవరి  7వ తేదీన  హైద్రాబాద్ శివారులో  డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ ను  పోలీసులు అరెస్ట్  చేశారు. బెంగుళూరు నుండి డ్రగ్స్   తీసుకువచ్చి  హైద్రాబద్  లో విక్రయిస్తున్నట్టుగా  పోలీసులు గుర్తించారు. నిందితుడిని  గాడ్విన్  ఇతియాన్యిగా  పోలీసులు చెప్పారు.  నిందితుడి నుండి  20 గ్రాముల కొకైన్ ను  పోలీసులు సీజ్  చేశారు.హైద్రాబాద్ శంషాబాద్  లో  2022 డిసెంబర్  25న  భారీగా డ్రగ్స్ ను పోలీసులు సీజ్   చేశారు.  కొత్త సంవత్సర వేడుకల కోసం  డ్రగ్స్ ను తీసుకువచ్చినట్టుగా  పోలీసులు గుర్తించారు. 

click me!