కులం పేరుతో దళితులపై దూషణలు.. రేపు హైదరాబాద్‌కు జాతీయ ఎస్సీ కమీషన్, చిక్కుల్లో మైనంపల్లి

By Siva KodatiFirst Published Aug 17, 2021, 6:59 PM IST
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించడాన్ని  దళిత సంఘాలు జాతీయ ఎస్సీ కమీషన్ దృష్టికి తీసుకెళ్లాయి. ఆందోళనకు దిగిన దళిత మహిళలను అరెస్ట్ చేసి పేట్ బషీర్‌బాగ్ పీఎస్‌లో అర్ధరాత్రి వరకు వుంచడాన్ని కమీషన్ సీరియస్‌గా పరిగణించింది. 

మల్కాజిగిరి ఇష్యూను జాతీయ ఎస్సీ కమీషన్ సీరియస్‌గా తీసుకుంది. దీనిలో భాగంగా రేపు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు జాతీయ ఎస్సీ  కమీషన్ వైస్ చైర్మన్ అరుణ్ అల్డర్. ఈ సందర్భంగా బాధితులను కలిసి విచారణ చేయనున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన అనుచరులు దళిత మహిళలను కులం పేరుతో దూషించడాన్ని  దళిత సంఘాలు కమీషన్ దృష్టికి తీసుకెళ్లాయి. ఆందోళనకు దిగిన దళిత మహిళలను అరెస్ట్ చేసి పేట్ బషీర్‌బాగ్ పీఎస్‌లో అర్ధరాత్రి వరకు వుంచడాన్ని కమీషన్ సీరియస్‌గా పరిగణించింది.

Also Read:బీజేపీVsటీఆర్ఎస్: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లితో పాటు కొడుకుపై కేసు

కాగా, మల్కాజిగిరి  ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కొడుకు రోహిత్ పై కూడ పోలీసులు కేసు నమోదు చేశారు.మల్కాజిగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య  ఘర్షణ చోటు చేసుకొంది. ఆదివారం నాడు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో  బీజేపీ కార్పోరేటర్ పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగారు. ఈ విషయమై  ఈ నియోజకవర్గంలో  మల్కాజిగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య సోమవారం నాడు కూడ ఘర్షణ చోటు చేసుకొంది. 

click me!