కేటీఆర్ చాలెంజ్‌ను స్వీకరించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు, బాలినేనిలను నామినేట్ చేసిన జనసేనాని

Published : Aug 07, 2022, 01:14 PM IST
కేటీఆర్ చాలెంజ్‌ను స్వీకరించిన పవన్ కల్యాణ్.. చంద్రబాబు, బాలినేనిలను నామినేట్ చేసిన జనసేనాని

సారాంశం

జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) సందర్భంగా చేనేత దస్తులను ధరించాలనే ప్రచారాన్ని విస్తృతం చేసేలా ట్విట్టర్‌లో #MyHandloomMyPride చాలెంజ్ కొనసాగుతుంది. ఈ చాలెంజ్‌లో భాగంగా.. చేనేత దస్తులు ధరించిన ఫొటోను షేర్ చేయడంతో పాటుగా.. తర్వాత చాలెంజ్ స్వీకరించాలని మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నారు.

జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7).. చేనేత దస్తులను ధరించాలనే ప్రచారాన్ని విస్తృతం చేసేలా ట్విట్టర్‌లో #MyHandloomMyPride చాలెంజ్ కొనసాగుతుంది. ఈ చాలెంజ్‌లో భాగంగా.. చేనేత దస్తులు ధరించిన ఫొటోను షేర్ చేయడంతో పాటుగా.. తర్వాత చాలెంజ్ స్వీకరించాలని మరో ముగ్గురిని నామినేట్ చేస్తున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ నుంచి మై హ్యాండ్లూమ్ మై ప్రైడ్ చాలెంజ్‌ను స్వీకరించిన మంత్రి కేటీఆర్.. చేనేత దస్తులు ధరించిన ఫొటోలను షేర్ చేశారు. తర్వాత మరో ముగ్గురిని నామినేట్ చేశారు. 

ఈ చాలెంజ్‌కు పారిశ్రామిక వేత్త ఆనంద మహేంద్ర, క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను నామినేట్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున.. చేనేత దుస్తుల ధరించిన చిత్రాలను పోస్ట్ చేసి వారి ప్రేమను తెలియజేయాలని కోరారు. 

 


దీనిపై స్పందించిన పవన్ కల్యాన్.. కేటీఆర్ చాలెంజ్‌ను స్వీకరించారు. రామ్ భాయ్ చాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను. చేనేతల మీద తనకున్న ప్రేమాభిమానాలను చాటుకుంటూ చేనేత వస్త్రాలు ధరించిన ఫొటోలను పవన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అనంతరం ఈ చాలెంజ్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్‌లను నామినేట్ చేశారు. ఇక, పవన్ చాలెంజ్ స్వీకరించడంపై స్పందించిన కేటీఆర్.. థాంక్స్ అన్న అని పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్