తెలంగాణ సర్కారుకు హరిత ట్రిబ్యూనల్ షాక్

First Published Sep 15, 2017, 10:06 PM IST
Highlights
  • కోర్టు ధిక్కారణ కింద నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆగ్రహం
  • స్వతంత్ర కమిషన్ ఏర్పాటులో అలసత్వం పై సీరియస్
  • 10 వేల జరిమానా విధించిన ట్రిబ్యూనల్

తెలంగాణ సర్కారుకు హైకోర్టు, సుప్రీం కోర్టులే కాదు హరిత ట్రిబ్యూనల్ కూడా గట్టి షాకే ఇచ్చింది. మితిమీరిన అలసత్వంపై ఆగ్రహం ప్రదర్శించింది హరిత ట్రిబ్యూనల్. అంతేకాకుండా వాయిదాకు పదివేల చొప్పున జరిమానా విధించింది. మరిన్ని  వివరాలు ఒకసారి చూద్దాం.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కేంద్ర పర్యవారణ అనుమతులు లేకుండానే చేపడుతున్నారని, అటవీ శాఖ అనుమతులు లేకుండానే ఫారెస్టులో పనులు జరుపుతున్నారని, దానితోపాటు ఇతరత్రా అనుమతులు కూాడా తీసుకోలేదన్న ఆరోపణలున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ అనుమతులు లేకుండా పనులు జరపడంపై వాస్తవాలను నిర్దారించేందుకు ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసి విచారణ జరపాలని హైదరాబాద్ కు చెందిన అడ్వొకెట్ హర్షవర్దన్ రెడ్డి గ్రీన్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించారు. 

ఈ వాజ్యంపై శుక్రవారం చెన్నైలోని గ్రీన్ ట్రిబ్యూనల్ ధర్మాసనం విచారణ జరిపింది.  ఇండిపెండెంట్ కమిషన్ డిక్లరేషన్ విషయంలో ఎందుకు డిలే చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిలదీసింది.

దీనిపై మరో వాయిదా కోరారు తెలంగాణ అదనపు అడ్వొకెట్ జనరల్ రామచంద్రారావు. కానీ ఎన్నిసార్లు వాయిదాలు కోరుతారంటూ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతి వాయిదాకు పదివేల చొప్పున జరిమానా విధిస్తూ కేసును ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబర్ 6 వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ దగ్గర హామీ తీసుకున్నది. కేసును అక్టోబరు 6కు వాయిదా వేసింది. 

click me!