తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ సీరియస్.. భారీగా జరిమానా..

Published : Dec 22, 2022, 12:47 PM ISTUpdated : Dec 22, 2022, 12:49 PM IST
తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ సీరియస్.. భారీగా జరిమానా..

సారాంశం

తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని ఎన్జీటీ చెన్నై బెంచ్ సీరియస్‌ అయింది.

తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌లు చేపడుతున్నారని ఎన్జీటీ చెన్నై బెంచ్ సీరియస్‌ అయింది. తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ అనుమతులు లేకుండా పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపడుతుందని దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ ధర్మాసం.. రెండు ప్రాజెక్టుల పూర్తి వ్యవయంలో 1.5 శాతం జరిమానా విధించింది. దీంతో రూ. 900 కోట్ల వరకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించినట్టయింది. ఈ జరిమానా మొత్తాన్ని కేఆర్‌ఎంబీ వద్ద జమ చేయాలని తెలిపింది.  తీర్పును తప్పనిసరిగా అమలు చేయాలని పేర్కొంది. పట్టిసీమ, పురుషోత్తమపట్నం వ్యవహారంలో అనుసరించిన విధానాన్నే ఈ విషయంలో కూడా అమలు చేయాలని తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?