బంజారాహిల్స్‌లో భారీ చోరీ.. రూ. కోటి విలువైన వజ్రాలు, బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు..

Published : Dec 22, 2022, 12:16 PM IST
బంజారాహిల్స్‌లో భారీ చోరీ..  రూ. కోటి విలువైన వజ్రాలు, బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు..

సారాంశం

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ చోరీ జరిగింది. ఫిలింనగర్ సైట్ 2లో ఆభరణాల తయారీ సంస్థలో రూ. కోటి విలువైన వజ్రాలు, బంగారం చోరీకి గురయ్యాయి.

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ చోరీ జరిగింది. ఫిలింనగర్ సైట్ 2లో ఆభరణాల తయారీ సంస్థలో రూ. కోటి విలువైన వజ్రాలు, బంగారం చోరీకి గురయ్యాయి. వివరాలు.. పవన్ కుమార్ అనే వ్యక్తి శమంతక డైమండ్స్ అనే పేరుతో షాపును నిర్వహిస్తున్నారు. వినియోగదారుల నుంచి ఆర్డర్‌ తీసుకుని.. సూరత్ నుంచి బంగారం ముడి సరుకు తీసుకొచ్చి ఆభరణాలు చేయించి ఇస్తుంటారు. పవన్ మంగళవారం రోజు షాపుకు తాళం వేసి బంగారం ముడి సరుకు లాకర్ లో పెట్టి వెళ్లాడు. 

అయితే బుధవారం షాపు తెలిరి చూడగా.. రూ.కోటి విలువచేసే వజ్రాలు, బంగారం చోరీకి గురైనట్టుగా గుర్తించారు. దీంతో వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు షాప్ వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేపట్టారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RTC: తెలంగాణ ఆర్టీసీ మ‌రో కీల‌క నిర్ణ‌యం.. ఇక‌పై బ‌స్సుల్లో మెట్రో త‌ర‌హా ఏర్పాట్లు
హైద‌రాబాద్‌లో రూ. 70 వేల కోట్ల‌తో భారీ ఏఐ డేటా సెంట‌ర్‌.. ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం