విజయ పాలదే విజయం...

By Arun Kumar PFirst Published Feb 8, 2019, 5:49 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వ సంస్థ విజయ డెయిరీకి జాతీయ అవార్డు లభించింది.  పాల స్వచ్చత విషయంలో రాజీ లేకుండా వ్యవహరిస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడుతన్నందుకు విజయ డెయిరీకి ప్రశంసిస్తూ ఈ అవార్డుకు ఎంపికచేసినట్లు ఐఎఫ్‌ఎస్‌ఎస్ ప్రకటించింది. ఇవాళ డిల్లీ  వేదికగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశ్విని చౌబే చేతులమీదుగా  టీఎస్‌డీసీఎఫ్ అధికారులు ఈ అవార్డును అందుకున్నారు.    
 
మొత్తం 20 కేటగిరీల్లో అత్యుత్తమంగా వ్యవహరించిన సంస్థలను ఐఎఫ్‌ఎస్‌ఎస్ గుర్తించింది. దేశవ్యాప్తంగా వున్న వివిధ సంస్థల పనితీరు, ప్రజా సంక్షేమం కోసం వారు అవలంబించే విధానాలు, సామాజిక స్పృహ ఇలా పలు కోణాల్లో వివిధ సంస్థల పనితీరును ఆధారంగా ఈ అవార్డుల ఎంపిక చేపట్టారు. ఈ క్రమంలో ప్రభుత్వ సాంఘీక సంక్షేమ పాఠశాలలు, అంగన్‌వాడీల ద్వారా చిన్నారులకు, గర్భిణిలకు విజయ డైరీ స్వచ్చమైన పాలను అందిస్తున్నట్లు ఐఎఫ్‌ఎస్‌ఎస్ గుర్తించింది. దీంతో  తెలంగాణ విజయ డెయిరీకి అవార్డు దక్కింది.

 కేంద్ర మంత్రి ఛౌబే విజయ డైరీ తరపున అవార్డును అందుకున్న టీఎస్‌డీసీఎఫ్ ఎండీ శ్రీనివాసరావు, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ మల్లయ్యలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ...విజయ పాల స్వచ్చత విషయంలో తాము విజయవంతమయయ్యామని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం, విజయ డెయిరీ అధికారుల నిబద్దతతో కూడిన పనితీరుకు నిదర్శనమే ఈ అవార్డని ఆయన అన్నారు. బాలింతలు తమ చిన్నారులకు సైతం విజయ  పాలను పట్టిస్తున్నారంటే వాటి స్వచ్చత విషయంతో తామెలా పనిచేస్తున్నామో అర్థమవుతుందన్నారు. ఇలాంటి మరెన్నో విజయాలను విజయయ డెయిరీ అందుకోవాలని కోరుకుంటున్నట్లు శ్రీనివాసరావు  తెలిపారు. 

click me!