రూ.5కే భోజనం.. ప్రారంభించిన కేటీఆర్

Published : Feb 08, 2019, 02:40 PM IST
రూ.5కే భోజనం.. ప్రారంభించిన కేటీఆర్

సారాంశం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిరిసిల్ల పట్ణణంలో పర్యటించారు. 

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిరిసిల్ల పట్ణణంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన  పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే రూ.5కే భోజన పథకాన్ని ఆయన ప్రారంభించారు.

అక్షయపాత్ర పేరిట జిల్లా కేంద్రంలో రూ.5కే భోజనపథకాన్ని ప్రవేశపెట్టారు. భోజనం చేయడానికి వచ్చిన ప్రజలకు కేటీఆర్ స్వయంగా భోజనం వడ్డించడం విశేషం. అతి తక్కువ ధరకే భోజనం లభించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

అనంతరం కేటీఆర్ నెహ్రునరగ్ లోని వైకుంఠదామం, ఇందిరాపార్క్, ఏకలవ్య కమ్యూనిటీ హాల్, శాంతినగర్ లో ఓ పెన్ జిమ్ ని కూడా ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu