ఒత్తిడే కారణం:నార్సింగి శ్రీచైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్ధి సాత్విక్ మృతిపై ఏసీపీ

By narsimha lode  |  First Published Mar 1, 2023, 12:45 PM IST

నార్సింగి  శ్రీచైతన్య కాలేజీ  ఇంటర్ విద్యార్ధి సాత్విక్  మృతిపై  దర్యాప్తు  చేస్తున్నామని  పోలీసులు  చెప్పారు



హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నార్సింగి  శ్రీచైతన్య కాలేజీకి  చెందిన  ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్యకు  ఒత్తిడి  కారణమని  ఏసీపీ  రమణ గౌడ్ చెప్పారు. నార్సింగి  శ్రీ చైతన్య కాలేజీకి  చెందిన  ఇంటర్ విద్యార్ధి సాత్విక్  మంగళవారంనాడు  రాత్రి  ఆత్మహత్య చేసుకున్నాడు. క్లాస్ రూమ్ లోనే  సాత్విక్  ఆత్మహత్య  చేసుకున్నాడు. ఈ ఘటనపై   పేరేంట్స్,  విద్యార్ధి సంఘాలు  కాలేజీ ముందు  ఆందోళనకు దిగాయి. 

 ఈ ఆందోళన నేపథ్యంలో  పోలీసులు  కాలేజీ క్యాంపస్  ముందు భారీ బందో బస్తు  ఏర్పాటు  చేశారు.  సాత్విక్ ఆత్మహత్య విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే   కేసు కూడా నమోదు చేశారు.ఈ ఘటనపై ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్,  వార్డెన్ పై  కేసు నమోదు  చేసినట్టుగా  ఏసీపీ రమణగౌడ్ మీడియాకు  చెప్పారు.  సాత్విక్ ఆత్మహత్యకు గల కారణాలపై  తాము విచారణ  సాగిస్తామని  ఏసీపీ తెలిపారు.

Latest Videos

undefined

ఈ కాలేజీలో  వైస్ ప్రిన్సిపల్  , ఇతర లెక్చర్లు  విద్యార్ధులను వేధింపులకు  గురి చేస్తున్నారని  సాత్విక్ పేరేంట్స్  ఆరోపిస్తున్నారు. ఈ విషయమై గతంలో  పలుమార్లు  కాలేజీ యాజమాన్యంతో చర్చించేందుకు  ప్రయత్నించినా  పట్టించుకోలేదని  సాత్విక్ తండ్రి  రాజు ఆరోపిస్తున్నారు. 

also read:శ్రీ చైతన్య కాలేజీలో సాత్విక్ ఆత్మహత్యపై విచారణ.. ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీచేసిన సబితా ఇంద్రారెడ్డి..

సాత్విక్ మృతి చెందిన విషయమై  కూడా  తమకు సమాచారం ఇవ్వలేదని  పేరేంట్స్  చెబుతున్నారు.  కాలేజీకి వెళ్లాలంటేనే సాత్విక్  ఆందోళనతో  ఉండేవారని  పేరేంట్స్  గుర్తు చేసుకుంటున్నారు. ఫస్టియర్ పరీక్షలూ పూర్తి కాగానే మరో కాలేజీకి  సాత్విక్ ను మార్చాలని  నిర్ణయించుకున్నామని  పేరేంట్స్  చెబుతున్నారు.ఈ లోపుగానే  సాత్విక్  మృతి చెందాడని  తల్లిదండ్రులు  కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 

tags
click me!