కళ్యాణలక్ష్మి చెక్ లు అందడం లేదన్న యువకుడు: ఆగ్రహం వ్యక్తం చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే

By narsimha lodeFirst Published Sep 25, 2022, 1:15 PM IST
Highlights

కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్దిదారులకు చెక్ లు సకాలంలో అందడం లేదని చెప్పిన యువకుడిపై   నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై వీడియో సై సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది. 
 


మెదక్: కళ్యాణ లక్ష్మి పథకం కింద లబ్దిదారులకు చెక్ లు సకాలంలో అందడం లేదని  చెేప్పిన యువకుడిపై నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోపల వేయాలని ఎస్ఐను ఆదేశించారు. 

నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. కళ్యాణలక్ష్మి పధకం కింద  గురించి ఎమ్మెల్యే చెబుతున్నారు. వివాహం  చేసిన ఆడపిల్లల కుటుంబాలకు ప్రభుత్వం నుండి కళ్యాణలక్ష్మి పథకం కింద చెక్ లు పంపిణీ చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కళ్యాణ లక్ష్మి పథకం కింద చెక్ లు అందుతున్నాయా లేవా అని  ఆయన ప్రశ్నించాడు. 
ఈ సభలో ఉన్న యువకుడు కళ్యాణలక్ష్మి పథకం కింద చెక్ లు రావడం లేదని చెప్పాడు.  దీంతో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశాడు. బట్టేబాజ్ అంటూ ఆ యువకుడిపై ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ యువకుడిని లోపల వేయాలని అక్కడే ఉన్న ఎస్ఐని ఆదేశించారు. యువకుడి తీరుపై ఆయన మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని 2014 అక్టోబర్ రెండో తేదీన ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లోని లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో రెండులక్షలు  ఆదాయం ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. ఈ పథకానికి 2014-15 బడ్జెటులో రూ. 230 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. 2016-17 బడ్జెటులో రూ.  738 కోట్ల రూపాయలు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం.

అయితే 2018 మార్చి 19వ తేదీన కళ్యాణ లక్ష్మి కింద రూ. 1,00, 116కి పెంచింది ప్రభుత్వం. పెళ్లి సమయంలోనే వధువు కుటుంబానికి ప్రభుత్వం అందించనుంది.  2018-19 లో బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 1450 కోట్లు కేటాయించింది. 2021 సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని 7,14,575 మంది లబ్దిదారులకు ప్రభుత్వం ఆర్ధిక సహయం అందించింది .వీరికి ఆర్ధిక సహయం కోసం ప్రభుత్వం రూ. 5,556.54 కోట్లు ఖర్చు చేసింది.
 

click me!