గంగుల కమాలకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

Published : Oct 06, 2018, 01:56 PM IST
గంగుల కమాలకర్ కు తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

కొత్తగా వచ్చిన స్పీడ్‌బోటులో ఎల్‌ఎండీలో ప్రయాణించి తిరిగి ఒడ్డుకు చేరుకున్న అనంతరం బోటు నుంచి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పట్టుజారి ఆయన నీటిలో పడిపోయారు.   

మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్‌కు ప్రమాదం తప్పింది. కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయంలో ఆయన స్పీడ్‌ బోటును పరిశీలించి దిగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొత్తగా వచ్చిన స్పీడ్‌బోటులో ఎల్‌ఎండీలో ప్రయాణించి తిరిగి ఒడ్డుకు చేరుకున్న అనంతరం బోటు నుంచి దిగుతున్న సమయంలో ఒక్కసారిగా పట్టుజారి ఆయన నీటిలో పడిపోయారు. 

అయితే లైఫ్‌జాకెట్‌ వేసుకోవడం.. అక్కడ పెద్దగా లోతులేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే సిబ్బంది ఆయన్ని ఒడ్డుకు తీసుకువచ్చారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న కారణంగా కమలాకర్‌ స్పీడ్‌ బోటు ప్రారంభోత్సవానికి కాకుండా.. దాన్ని పరిశీలించేందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్