ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

By Arun Kumar PFirst Published Oct 6, 2018, 12:34 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానితో కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ముందు నన్ను దాటాలంటూ రేవంత్  సవాల్ విసిరారు. అ తర్వాతే ఎవరినైనా టార్గెట్ చేయాలంటూ సూచించారు. మూడు రోజుల పాటు తనపై సోదాలు చేయించి ఏం సాధించారని రేవంత్ ప్రశ్నించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధానితో కలిసి తనపై కుట్రలు పన్నుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ముందు నన్ను దాటాలంటూ రేవంత్  సవాల్ విసిరారు. అ తర్వాతే ఎవరినైనా టార్గెట్ చేయాలంటూ సూచించారు. మూడు రోజుల పాటు తనపై సోదాలు చేయించి ఏం సాధించారని రేవంత్ ప్రశ్నించారు. 

ప్రధాని మోదీతో కేసీఆర్ కుమ్మకై తనపై వున్న రైల్వే కేసులన్ని ఎత్తేయించుకున్నాడని రేవంత్ ఆరోపించారు. ప్రధానికి కేసీఆర్ కుటుంబంపై ఉన్న ప్రేమ తెలంగాణ సమాజంపై లేదన్నారు. అలాగే కేసీఆర్ కు కూడా తెలంగాణ ప్రజలన్నా... ఉద్యమకారులన్నా ప్రేమే లేదన్నారు. 

మళ్ళీ అధికారంలోకి రావాలన్న దుర్భుద్దితో కేసీఆర్ మరో నాటకానికి తెరతీశాడని రేవంత్ విమర్శించాడు. అయితే కేసీఆర్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. తెలంగాలణలో జరిగే ఎన్నికలు కేసీఆర్, చంద్రబాబుల మధ్యే అంటూ మరోసారి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. అయితే ముమ్మాటికీ ఎన్నికలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే అని రేవంత్ స్పష్టం చేశారు. 

దేశంలోని ముఖ్యమంత్రుల్లో కెల్లా కేసీఆర్ అధముడు అంటూ ఘాటు వ్యాఖ్యలు రేవంత్ చేశాడు. సఎం పదవి పోతుందన్న భయంతోనే కేసీఆర్ నీచంగా వహరిస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రావాళ్లు అంటూ విమర్శలు చేస్తున్న కేసీఆర్ కు అమరావతికి వెళ్లినపుడు ఆ విషయం గుర్తుకురాలేదా అని రేవంత్ ప్రశ్నించారు.

తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న చానళ్లపై పరువునష్టం దావా వేస్తానని రేవంత్ హెచ్చరించారు.  కావాలనే తనకు హాకాంగ్, మలేషియా, సింగపూర్ లో బ్యాంకు ఖాతాలు ఉన్నట్లు గంటు గంటలు ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా టివి9, టీ న్యూస్, నమస్తే తెలంగాణ లలో తప్పుడు వార్తలు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. వాటి వల్ల తన ప్రతిష్టకు భంగం కలిగిందని...వెంటనే అవి తప్పుడు వార్తలని ప్రజలకు వివరించాలని హెచ్చరించారు. అలాగే బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని...లేకుంటే పరువు నష్టం కేసు వేస్తానని రేవంత్ హెచ్చరించారు.
 

click me!