
కామారెడ్డి: జిల్లాలోని బీర్కూర్ మండలం రైతు నగర్ లో కిరాణాషాపు నిర్వహిస్తున్న నారాయణ దంపతులను గుర్తు తెలియని దుండగులు మంగళవారంనాడు రాత్రి హత్య చేశారు. దోపీడీ దొంగలు ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
నారాయణ ఇంటి వెనుక వైపు నుండి ప్రవేశించిన దుండగులు నారాయణను కొట్టి చంపారు. నారాయణ భార్యను ఉరేసి చంపారు. నారాయణ దంపతులను హత్య చేసింది దొంగలా, ఇతరులా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.