బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం.. హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..

Published : Jun 13, 2023, 11:24 AM IST
బాచుపల్లి నారాయణ కాలేజీలో విషాదం.. హాస్టల్ బిల్డింగ్ మీదినుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య..

సారాంశం

బాచుపల్లిలోని నారాయణ కాలేజీ బాలికల హాస్టల్ క్యాంపస్ లో ఓ విద్యార్థిని బిల్డింగ్ మీదినుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 

హైదరాబాద్ : హైదరాబాద్ బాచుపల్లిలోని నారాయణ కాలేజీలో విషాద ఘటన చోటు చేసుకుంది. బాలికల హాస్టల్ క్యాంపస్ భవనం మీదినుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థిని ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న వంశికగా గుర్తించారు. ఆమెది కామారెడ్డి జిల్లాగా చెబుతున్నారు. వంశిక వారం రోజులక క్రితమో క్యాంపస్ లో చేరినట్లుగా సమాచారం. అంతలోనే ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే