నయీం అనుచరుడు శేషన్నకి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడకి తరలింపు

By Siva KodatiFirst Published Sep 28, 2022, 6:13 PM IST
Highlights

గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నకు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇతనిపై హత్య కేసులతో పాటు ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. 
 

గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నాంపల్లి కోర్ట్‌కు తరలించారు పోలీసులు. ఈ సందర్భంగా అతనికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో శేషన్నను పోలీసులు చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే నయీంపై పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదుయ్యాయి. హత్య కేసులతో పాటు ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. షేక్‌పేట్‌లో పోలీసులు నిన్న వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా పోలీసులకు చిక్కాడు శేషన్న. 

కాగా.. శేషన్నఉపయోగించిన మొబైల్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. శేషన్నకు ఆయుధాలు ఎక్కడి నుండి వస్తున్నాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నయీం ఎన్ కౌంటరైన తర్వాత శేషన్న పోలీసులకు చిక్కకుండా పారిపోయాడు. కొత్తపేటలో సెటిల్ మెంట్  చేస్తున్న సమయంలో శేషన్నను సోమవారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్, కౌంటర్ ఇంటలిజెన్స్, పోలీసులు శేషన్నను ప్రశ్నిస్తున్నారు. ఎవరెవరితో శేషన్న కాంటాక్టులో ఉన్నాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుడు శేషన్నకు ఆయుధాలెక్కడివి?: కాల్ డేటాపై పోలీసుల ఆరా

హైద్రాబాద్ నగరంలోని హుమాయున్ నగర్ లో అక్బర్ అనే వ్యక్తికి శేషన్న వెపన్ విక్రయించాడు. అక్బర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే శేషన్న నుండి వెపన్ కొనుగోలు చేసినట్టుగా అతను సమాచారం ఇచ్చాడు. దీంతో శేషన్న కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. శేషన్న వద్ద నాలుగు ఆయుధాలున్నట్టుగా పోలీసులు గుర్తించారు. శేషన్నకు ఆయుధాలు ఎక్కడి నుండి వచ్చాయనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆరేళ్ల కాలంలో శేషన్న ఎంతమందికి ఆయుధాలు విక్రయించారనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మావోయిస్టు పార్టీలో పనిచేసిన శేషన్న జనజీవన స్రవంతిలో కలిశాడు. ఆ తర్వాత ఆయన నయీం గ్యాంగ్ లో చేరాడు. నయీం గ్యాంగ్ లో శేషన్న కీలకంగా మారాడు. సెటిల్ మెంట్లు, దందాలు శేషన్న ద్వారానే నయీం చేసేవాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 
 

click me!