ఉగ్రవాది కరీం తుండాపై బాంబు పేలుళ్ల కేసులు: నేడు నాంపల్లి కోర్టు తుది తీర్పు

By narsimha lodeFirst Published Feb 18, 2020, 10:37 AM IST
Highlights

హైద్రాబాద్‌లో పలు పేలుళ్ల కేసులకు సంబంధించి ఉగ్రవాది కరీం తుండాపై నాంపల్లి కోర్టు మంగళవారం నాడు తుది తీర్పును ఇవ్వనుంది. 


హైదరాబాద్: ప్రముఖ ఉగ్రవాది కరీం తుండాపై ఉన్న కేసులకు సంబంధించి హైద్రాబాద్ నాంపల్లి కోర్టు  మంగళవారం నాడు తుది తీర్పును ఇవ్వనుంది.హైద్రాబాద్‌తో పాటు పలు ప్రాంతాల్లో తుండాపై కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఘజియాబాద్‌ జైల్లో తుండా  ఉన్నాడు.

బాబ్రీమసీదు కూల్చివేతకు నిరసనగా  ప్రముఖ ఉగ్రవాది కరీం తుండా ప్రతీకార దాడులకు పూనుకొన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. హైద్రాబాద్‌లో కూడ కరీం తుండా పలు బాంబు దాడులకు పాల్పడినట్టుగా పోలీసులు కేసులు  నమోదు చేశారు.

తాంజిమ్ ఇస్లామిక్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ ఏర్పాటులో కరీం కీలకంగా వ్యవహరించారు. కరీం ప్రధాన అనుచరుడు కలీల్ అన్సారీని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్‌లో కూడ కొంతకాలం పాటు ఆయన తలదాచుకొన్నాడు. ఏడేళ్ల క్రితం తుండా నేపాల్‌లో ఉన్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంను విచారించిన సమయంలో దేశంలో పలు దాడులకు సంబంధించిన సమాచారం వెలుగు చూసింది.

1990లో యువకులను ఉగ్రవాదం వైపు తుండా మళ్లించేవాడని పోలీసులు చెబుతున్నారు.  1993లో వరుస బాంబు పేలుళ్లలో తుండా కీలకంగా వ్యవహరించాడని పోలీసులు కేసులు నమోదు చేశారు. 

ఢిల్లీ వెళ్లే రైలులో కూడ తుండా బాంబులు పెట్టినట్టుగా ఆయనపై కేసులు ఉన్నాయి.  ఘజియాబాద్‌ జైల్లో ఉన్న తుండాను హైద్రాబాద్ పోలీసులు పిటీ వారంట్‌పై తీసుకొచ్చి విచారించారు.హైద్రాబాద్‌ నగరంలో చోటు చేసుకొన్న పలు కేసులకు సంబంధించి  హైద్రాబాద్ నాంపల్లి కోర్టు మంగళవారం నాడు తీర్పు ఇవ్వనుంది.  

 

click me!