ఆ ముగ్గురికి చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టులు: షెల్ కంపెనీల గుట్టు రట్టు

By Arun Kumar PFirst Published Feb 18, 2020, 10:18 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేేశ్ లో ఇటీవల జరిగిన ఐటీ రైడ్స్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ రైడ్స్ కు సంబంధించిన పూర్తి పంచనామా నివేదిక బహిర్గతమయ్యింది. 

అమరావతి: ఐటీ శాఖ ఇటీవల చేసిన దాడులపై ఇప్పటికే ఏపిలో రాజకీయ ప్రకంంపనలు సృష్టించాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ పై దాడులు జరగడం రాజకీయంగా బాగా ప్రాధాన్యత సంతరించుకుంది. దీన్ని ఆసరాగా చేసుకుని వైసిపి నాయకులు చంద్రబాబుపై విమర్శలు చేయడం, వాటిని టిడిపి నాయకులు తిప్పికొట్టడం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈ ఐటీ దాడులపై పూర్తి పంచనామా నివేదిక తాజాగా విడుదలయ్యింది. 

ఫిబ్రవరి 13వ తేదీలో తయారయినట్లుగా వున్న ఈ  పంచనామా నివేదిక లో టీడీపీ నేతలు శ్రీనివాసులురెడ్డి, ప్రత్తిపాటి, కిలారు రాజేష్ పేర్లున్నాయి. ఈ ముగ్గురికి సంబంధించిన మూడు కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం కాంట్రాక్టులు అప్పగించినట్లుగా వుంది.  ఇలా తమకు లభించిన కాంట్రాక్టులను వారు తిరిగి అనామక కంపెనీలకు సబ్ కాంట్రాక్టులుగా అప్పగించినట్లు  తెలిపారు. 

ఈ మూడు సంస్ధల నుండి  సబ్ కాంట్రాక్టులు పొందిన సంస్ధలన్నీ బినామీలు లేదా షెల్ కంపెనీలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. రూ.2 కోట్ల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన కంపెనీలకు సబ్ కాంట్రాక్టుల అప్పగించి పన్ను ఎగవేత, ఆడిటింగ్ నుంచి తప్పించుకునేందుకు సదరు కంపెనీలు ప్రయత్నించాయని నివేదికలో పేర్కొన్నారు. బోగస్ బిల్లుల తయారీతో తమ సంస్ధల విలువను షెల్ కంపెనీలు భారీగా పెంచుకున్నట్లు తేలిందని వుంది. 

read more  చంద్రబాబు కుటుంబంపై దుష్ప్రచారం...సాక్షిని వదిలేదే లేదు...: యనమల

సబ్ కాంట్రాక్టుల ద్వారా తమకు లభించిన మొత్తాలను డ్రా చేసిన  షెల్ కంపెనీలు టీడీపీ పెద్దలకు అందించినట్లు వుంది. ఈ మొత్తం తిరిగి హవాలా మార్గంలో విదేశాలకు తరలించినట్లు గుర్తించారు. తిరిగి ఈ నిధులు ఎఫ్.డి.ఐల రూపంలో టీడీపీ నేతల కంపెనీలకు చేరినట్లుగా వుంది. ఇలా విదేశాల నుండి టిడిపి నేతలకు చేరిన నల్లధనం రూ.2 వేల కోట్ల పైమాటేనని ఐటీ శాఖ తేల్చింది. 

కొందరు నేతలు ఐటీ, ఫెమా, బినామీ చట్టాలను ఉల్లంఘించినట్లు అధికారుల గుర్తించిట్లుగా పంచనామా నివేదికలో పేర్కోన్నారు. నిబంధనల ఉల్లంఘన కింద కేసుల నమోదుకు 21 నెలలు పట్టొచన్న ఐటీ  పంచనామాలో పేర్కొన్నారు. 

విదేశాలకు నిధుల తరలింపు నేపథ్యంలో సోదాల్లో సేకరించిన సమాచారాన్ని ఈడీతో పంచుకోనున్న ఐటీ వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ కింద ఈడీ కేసులు నమోదు చేసే అవకాశం  కూడా వుందని తెలిపింది. మనీలాండరింగ్ రుజువైతే ఐదేళ్ల జైలుశిక్ష, మూడు రెట్ల జరిమానా విధింపు వుండనుంది. విచారణకు సహకరించకపోతే ఈడీ అరెస్టు చేసే అవకాశం కూడా  తెలిపారు. 

read more  నిరుద్యోగులకు శుభవార్త... ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆదేశం

బినామీ చట్టం కింద కూడా చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీల చట్టం ప్రకారం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసు ఏర్పాటు చేసి ఇందులో పాల్గొన్న సంస్ధలపై ప్రత్యేక దర్యాప్తు చేసే అవకాశం వున్నట్లు... ఎస్ఎఫ్ఐఓ ఏర్పాటు కోరుతూ కేంద్రం లేదా రాష్ట్రం కూడా కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

click me!